2025: రాజుపేట మండలం బేగంపేటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ABN, Publish Date - Aug 14 , 2025 | 09:23 PM
బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వతంత్ర సమరయోధుల బద్దం నర్సిరెడ్డి, బెల్జే వీరయ్య, చిగుళ్ల మల్లయ్య స్థానిక చౌరస్తాలో మువ్వన్నెల జెండాకు ఎగరవేశారు.

తమ దేశభక్తికి ప్రతీకగా గత 78 ఏళ్ల నుంచి మువ్వన్నెల జెండా ఎగురుతోంది. ఆగస్ట్ 15వ తేదీ దేశ స్వాతంత్ర్య దినోత్సవం.
ఈ సందర్భంగా బేగంపేట చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి స్థానికులు పూల మాల వేశారు అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు జెండాలు పట్టుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మద్దతుగా నినాదాలు చేశారు.
అలాగే ఈ వేడుకల వేళ.. చౌరస్తా వద్ద డప్పులు వాయించారు. ఈ జెండా వందన కార్యక్రమానికి గ్రామస్తులు భారీగా హాజరయ్యారు.
Updated Date - Aug 14 , 2025 | 09:23 PM