మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్..
ABN, Publish Date - Dec 24 , 2025 | 01:09 PM
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా రెండు, మూడో టెస్టుల మధ్య నూసాలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు విచ్చలవిడిగా మద్యం తాగారన్న వార్త సంచలనం రేపిన విషయం తెలిసిందే. డకెట్ ఏకంగా మద్యం మత్తులో హోటల్ దారి మర్చిపోయాడనే వీడియో వైరలైంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది.
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా రెండు, మూడో టెస్టుల మధ్య నూసాలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు విచ్చలవిడిగా మద్యం తాగారన్న వార్త సంచలనం రేపిన విషయం తెలిసిందే.
డకెట్ ఏకంగా మద్యం మత్తులో హోటల్ దారి మర్చిపోయాడనే వీడియో వైరలైంది. ఈ ఘటనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది.
తమపై వచ్చిన ఆరోపణలపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని స్టోక్స్ కొట్టి పారేశాడు.
‘ఈ సమయంలో నేను ఎలా వ్యవహరిస్తున్నాను అనేదే నాకు అత్యంత కీలకం. కెప్టెన్‌గా నా ఆటగాళ్లను సాధ్యమైనంత వరకు రక్షించడం నా ప్రధాన కర్తవ్యం’ అని స్టోక్స్ వెల్లడించాడు.
‘యాషెస్ సిరీస్‌ను ఇంకా రెండు మ్యాచులు ఉండగానే కోల్పోయాం. ఇలాంటి సమయంలో మా జట్టు ఆటగాళ్లను చూసుకోవడం నా బాధ్యత.
అందుకే నేను ఎప్పుడూ నా ఆటగాళ్ల వెనక నిలబడతాను’ అని మద్యం మత్తులో ఉన్న ఆటగాళ్ల విషయంపై పరోక్షంగా స్పందిస్తూనే ఆ విషయాన్ని స్టోక్స్ కొట్టిపారేశాడు.
Updated Date - Dec 24 , 2025 | 01:09 PM