ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt Scheme: సబ్సిడీతో రూ. 3 లక్షల రుణం.. పూర్తి వివరాలివే..

ABN, Publish Date - Sep 19 , 2025 | 05:28 PM

కార్మికులు, కుల వృత్తిదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.

1/9

దేశ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రజలు అనేక రకాలుగా ప్రయోజనం పొందుతున్నారు.

2/9

ఇందులో భాగంగానే కార్మికులు, కుల వృత్తిదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.

3/9

ఈ పథకం కింద ప్రజలకు శిక్షణ ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం, శిక్షణ అనంతరం బిజినెస్ కోసం సాయం కూడా చేస్తోంది.

4/9

18 సంప్రదాయ కుల వృత్తుల్లో నిమగ్నమైన వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

5/9

ఈ పథకం కింద లబ్ధిదారులకు కొన్ని రోజులు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కాలంలో రూ. 500 చొప్పున సాయం అందిస్తారు.

6/9

టూల్‌కిట్ కొనుగోలు చేయడానికి లబ్ధిదారులకు రూ. 15,000 కూడా ఇస్తారు.

7/9

అలాగే, లబ్ధిదారులకు శిక్షణ అనంతరం వ్యాపారం కోసం తక్కువ వడ్డీ రేటుకే రూ. 1 లక్ష రుణం కూడా ఇస్తారు.

8/9

ఆ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే.. అదనంగా మరో రూ. 2 లక్షల రుణం ఇవ్వడం జరుగుతుంది.

9/9

ఈ రుణం ద్వారా లబ్ధిదారులు మంచి వ్యాపారం ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ (https://pmvishwakarma.gov.in/) ను చూడొచ్చు.

Updated Date - Sep 19 , 2025 | 05:28 PM