Indian Railways: రాత్రి వేళలో రైళ్లు వేగంగా నడుస్తాయి.. కారణమేంటో తెలుసా..?
ABN, Publish Date - Sep 19 , 2025 | 01:16 PM
రైల్వే వ్యవస్థ ద్వారా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖచ్చుతో, తక్కువ సమయంలోనే తమ డెస్టినేషన్లకు చేరుకునే అవకాశం ఉండటంతో ప్రజలు సైతం ట్రైన్ జర్నీకి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.
భారతదేశంలో రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ అత్యంత కీలకమైంది. ఒక విధంగా చెప్పాలంటే వెన్నెముక వంటిదని చెప్పాలి.
రైల్వే వ్యవస్థ ద్వారా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖచ్చుతో, తక్కువ సమయంలోనే తమ డెస్టినేషన్లకు చేరుకునే అవకాశం ఉండటంతో ప్రజలు సైతం ట్రైన్ జర్నీకి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.
అయితే, ట్రైన్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రైళ్లు పగటి సమయంలో కంటే రాత్రి సమయంలోనే ఎక్కువ వేగంతో నడుస్తాయని మీకు తెలుసా? మరి ఈ తేడాకు గల కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సాధారణంగా రాత్రి సమయంలో కంటే పగటి సమయంలో ట్రాక్‌లపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. పగటి సమయంలో పట్టాలపై ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ ట్రైన్స్, షటిల్ ట్రైన్స్ భారీగా ప్రయాణిస్తాయి.
ఈ కారణంగా పగటి సమయంలో పట్టాలపై ట్రైన్స్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. తరచుగా రెడ్ సిగ్నల్స్ ఇస్తుంటారు. ఫలితంగా ట్రైన్స్ వేగం పగటి సమయంలో తక్కువగా ఉంటుంది.
ఇక రాత్రి సమయంలో పట్టాలపై రైళ్ల ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల సిగ్నల్స్ కూడా పెద్దగా అడ్డంకిగా మారవు. గ్రీన్స్ సిగ్నల్స్ అందుతుంటాయి. ఫలితంగా వాటి సగటు వేగం రాత్రి సమయంలో పెరుగుతుంటుంది.
Updated Date - Sep 19 , 2025 | 01:16 PM