దేవరగట్టులో బన్ని యాత్రలో విషాదం..
ABN, Publish Date - Oct 03 , 2025 | 09:41 PM
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవం రక్తసిక్తమైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్థరాత్రి స్వామి, అమ్మవారి వివాహం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు ప్రారంభమైంది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో రెండు వర్గాల మధ్య కర్రలతో ఘర్షణకు దిగాయి. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో పోటీ పడటంతో ఈ హింస ప్రారంభమైంది. అయితే గాయపడిన వారిని చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవం రక్తసిక్తమైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్థరాత్రి స్వామి, అమ్మవారి వివాహం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు ప్రారంభమైంది.
దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో రెండు వర్గాల మధ్య కర్రలతో ఘర్షణకు దిగాయి. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో పోటీ పడటంతో ఈ హింస ప్రారంభమైంది. అయితే గాయపడిన వారిని చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ బన్ని జైత్రయాత్రలో భాగంగా దేవతామూర్తులను రక్షించుకునేందుకు మూడు గ్రామాల భక్తులు ఒక వైపు.. ఏడు గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. ఈ సమరాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవరగట్టుకు తరలి వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ బన్ని యాత్రను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ పర్యవేక్షిస్తున్నారు.
దేవరగట్టులో సుమారు 800 అడుగల ఎతైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతామూర్తులను కాపాడుకోడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాలు భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.
ఈ క్రమంలో జరిగే దైవ కార్యంలో పలువురు భక్తులు గాయపడడం సహజంగా మారింది. ఇలా గాయపడిన వారికి స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తారు. వారి పరిస్థితి విషమంగా ఉంటే మాత్రం.. ఆసుపత్రులకు తరలిస్తారు.
అయితే చాలా మంది భక్తులు గాయాలపాలైనా.. స్థానికంగా దొరికే బండారు (పసుపు) పూసుకుని ఎలాంటి చికిత్స పొందకుండానే వెళ్లిపోతారు.
Updated Date - Oct 03 , 2025 | 09:41 PM