CP Radhakrishnan: తిరుమలలో సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం..
ABN, Publish Date - Aug 27 , 2025 | 01:44 PM
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం తెల్లవారుజామున శ్రీవెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు.
పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితోపాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు.
బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు.
అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి పి. నారాయణతోపాటు బీజేపీ అగ్రనేతలు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు.
Updated Date - Aug 27 , 2025 | 01:44 PM