ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmala Sitharaman: తిరుమలలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు ఘన స్వాగతం

ABN, Publish Date - Sep 11 , 2025 | 07:13 PM

తిరుపతిలో మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

1/5

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో పర్యటించనున్నారు. అందుకోసం గురువారం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

2/5

అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి, టీటీడీ ఎస్‌వీవో మురళీ కృష్ణా తదితరలు ఆమెకు స్వాగతం పలికారు.

3/5

అనంతరం రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి ఘనంగా స్వాగతం పలికారు.

4/5

మరోవైపు టీటీడీ ఈవోగా నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సైతం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కలుస్తారని తెలుస్తుంది.

5/5

శుక్రవారం ఉదయం ఆనంద నిలయంలో కొలువు తీరిన ఆ దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకోనున్నారు. అందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం తిరమల, తిరుపతిలో వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనున్నారు.

Updated Date - Sep 11 , 2025 | 07:16 PM