ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత..

ABN, Publish Date - Sep 07 , 2025 | 06:08 PM

భాద్రపద పౌర్ణమి నేపథ్యంలో రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలు మూసి వేశారు.

1/7

భాద్రపద పౌర్ణమి నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 7వ తేదీ) రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

2/7

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు అన్ని మూసి వేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ దేవాలయాలన్నీ మూత పడ్డాయి.

3/7

తిరుమలలోని శ్రీవారి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, సూర్య దేవాలయం, తిరుపతిలోని ముఖ్య దేవాలయాలు గోవిందరాజుల స్వామి ఆలయం, కోదండ రామస్వామి ఆలయం, తాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయం మూసివేశారు.

4/7

అలాగే విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, మంగళగిరిలోని పానకాల నరసింహస్వామి వారి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అన్నవరంలోని సత్యదేవుని ఆలయం, సింహచలంలోని శ్రీవారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంతోపాటు పలు ఆలయాలను మూసి వేశారు.

5/7

ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాల నుంచి అర్థరాత్రి 01 గంట 26 నిమిషాల వరకు ఉంటుంది.

6/7

అంటే మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం ఉండనుంది. రాత్రి 11 గంటల 42 నిమిషాలు గ్రహణ మధ్యస్థ కాలంగా జోతిష్య పండితులు నిర్ణయించారు.

7/7

ఈ దేవాలయాలను సోమవారం ఉదయం తిరిగి తెరవనున్నారు. దేవాలయాలను సంప్రోక్షణ అనంతరం భక్తులకు దేవుడిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు.

Updated Date - Sep 07 , 2025 | 07:28 PM