ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala:శ్రీవారి ఆలయం మూసివేత.. నిర్మానుష్యంగా మారిన తిరుమల

ABN, Publish Date - Sep 07 , 2025 | 07:24 PM

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనంద నిలయంలోని ఆ దేవదేవుడి విరాట్ రూపాన్ని దర్శించుకునేందుకు ఎప్పుడో అప్పుడు భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తారు. దీంతో తిరుమల ఆలయం వద్ద, రహదారులపై, దుకాణాలు వద్ద.. మరి ముఖ్యంగా క్యూ కాంప్లెక్స్‌ల్లోనే కాకుండా కంపార్ట్‌మెంట్లలో సైతం భక్తులు భారీగా కిక్కిరిసిపోయి ఉంటారు. ఇది నిత్యం తిరుమలలో కనిపించే దృశ్యం.

1/9

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు.

2/9

ఈ నేపథ్యంలో ఆనంద నిలయంలోని ఆ దేవదేవుడి విరాట్ రూపాన్ని దర్శించుకునేందుకు ఎప్పుడో అప్పుడు భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తారు.

3/9

దీంతో తిరుమల ఆలయం వద్ద, రహదారులపై, దుకాణాలు వద్ద.. మరి ముఖ్యంగా క్యూ కాంప్లెక్స్‌ల్లోనే కాకుండా కంపార్ట్‌మెంట్లలో సైతం భక్తులు భారీగా కిక్కిరిసిపోయి ఉంటారు. ఇది నిత్యం తిరుమలలో కనిపించే దృశ్యం.

4/9

కానీ ఆదివారం సెప్టెంబర్ 7వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు.

5/9

దీంతో తిరుమల, తిరుమాడ వీధులు, కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లు అన్ని భక్తులు లేకుండా వెలవెల పోయాయి.

6/9

అంతేకాదు.. తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్‌తోపాటు అలిపిరిలోని శ్రీవారి పాదాలు, అలివేలు మంగాపురంలోని శ్రీనివాసుని ఆలయంతోపాటు శ్రీవారి మెట్లు సైతం జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారిపోయింది.

7/9

అయితే శ్రీవారి ఆలయం మూసి వేసే కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జేఈవో వెంకయ్య చౌదరితోపాటు ఆలయంలోని వేద పండితులు, పూజారులు పాల్గొన్నారు.

8/9

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో్న్ని అని దేవాలయాలను మూసివేశారు. రాత్రి 9 గంటల 58 నిమిషాల నుంచి అర్థరాత్రి 1గంట 26 నిమిషాల వరకు ఈ గ్రహణం ఉండనుంది.

9/9

ఈ ఆలయాలను సోమవారం ఉదయం తిరిగి తెరుస్తారు. ఆలయంలో సంప్రోక్షణ అనంతరం.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 07:26 PM