Navin Ramgoolam: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ రాంగూలం..
ABN, Publish Date - Sep 15 , 2025 | 06:12 PM
మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రత్యేక దర్శనంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం పొందారు.
భారత్ పర్యటనలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలం
సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర
పద్మావతి అతిథిగృహం వద్ద నవీన్ చంద్రకు ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న మారిషస్ ప్రధాని
వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను మారిషస్ ప్రధాన మంత్రికి అందజేసిన వేదపండితులు
Updated Date - Sep 15 , 2025 | 06:14 PM