CM Chandrababu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ABN, Publish Date - May 02 , 2025 | 08:03 AM
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ఫించన్లు పంపిణీ చేశారు. కాలనీ వాసుల నుంచి అర్జీలను సీఎం చంద్రబాబు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు.
చలంచర్లలో పింఛన్‌ను అందజేస్తున్న సీఎం చంద్రబాబు
మహిళకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న మంత్రులు
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా వింటున్న ప్రజలు
నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుతో ఆత్మకూరు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఏపీలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలనేది, సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచన అని మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఆత్మకూరు నారంపేటలో ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ పార్కుని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఏపీలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా ఎదుగుతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
50 ఎంఎస్ఎంఈ పార్కులని ఇక్కడి నుంచే ప్రారంభించానని సీఎం చంద్రబాబు చెప్పారు. మండలానికో ఎంఎస్ఎంఈ పార్కు తీసుకురావాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రభుత్వంపై వారికి నమ్మకం ఉందని చెప్పారు. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రంగా అయిదు రీజనల్ హబ్‌లు పెడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలని విద్యాసంస్థలని అనుసంధానం చేయబోతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీలో అసంఘటిత కార్మికులు అధికంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందులోనూ వ్యవసాయం మీద అత్యధికంగా ఆధారపడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు.
టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
పీ4 కార్యక్రమంలో భాగంగా పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులను సీఎం చంద్రబాబు సన్మానించారు.
పదోతరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులను సీఎం చంద్రబాబు సన్మానించారు.
విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
విద్యార్థులు కష్టపడి చదువుకుంటే భవిష్యత్తులో రాణిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు.
నెల్లూరుపాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి అయ్యారు.
ఈ సందర్భంగా కార్మికులకి సీఎం చంద్రబాబు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులతో మాట్లాడి రాడ్ బెండింగ్, వైండింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు.
భవన నిర్మాణ కార్మికుల రోజు వారీ పనితీరు, రోజువారీ లభించే కూలీ వివరాల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.
కార్మికుల సమస్యల గురించి సానుకూలంగా ఆలోచించి పరిష్కార మార్గాలు చూపిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Updated Date - May 02 , 2025 | 08:49 AM