గోదావరి తీరాన పుష్కర ఘాట్‌లో అట్లతద్ది నోములు..
ABN, Publish Date - Oct 09 , 2025 | 10:09 PM
అట్లతద్ది నోముల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌కు మహిళలు భారీగా తరలి వచ్చి.. నోములు తీర్చుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద అట్లతద్ది సందర్భంగా మహిళలు నోములు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా భారీగా మహిళలు స్థానిక పుష్కర ఘాట్లకు తరలి వచ్చారు. ఆ క్రమంలో నది తీరంలో దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అట్లతద్ది సందర్భంగా మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
యువతులు మంచి భర్త రావాలని.. అలాగే వివాహిత మహిళలు.. నిండూ నూరేళ్లు ముత్తైదువులుగా ఉండాలని పూజలు చేశారు.
అట్లతద్ది సందర్భంగా ఉదయం నుంచి భక్తులు భారీగా నదిలో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం పుష్కరఘాట్ల వద్దకు చిన్నారుల నుంచి అవ్వల వరకు అంతా గోదావరి వద్దకు చేరుకుని.. ఆట పాటలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.
Updated Date - Oct 09 , 2025 | 10:09 PM