ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Student Visa Warning: క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు.. భారతీయ విద్యార్థులకు అమెరికా మరో వార్నింగ్

ABN, Publish Date - May 27 , 2025 | 01:47 PM

అమెరికాలోని భారతీయ విద్యార్థులు చెప్పాపెట్టకుండా క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు చేస్తామని ప్రభుత్వం తాజాగా వార్నింగ్ ఇచ్చింది.

US student visa warning

ఇంటర్నెట్ డెస్క్: వలసలను నిరోధించేందుకు రకరకాల ప్రయత్నాలను చేస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా భారతీయ విద్యార్థులకు మరో వార్నింగ్ ఇచ్చింది. క్లాసులు ఎగ్గొడితే కచ్చితంగా వీసా రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

చెప్పాపెట్టకుండా క్లాసులు ఎగ్గొట్టినా, డ్రాప్ ఔట్ అయినా, కళాశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రోగ్రామ్‌ నుంచి తప్పుకున్నా వీసా రద్దు చేసే అవకాశం ఉందని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వీసా నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటూ ఇబ్బందుల పాలు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని స్పష్టం చేసింది.


ఇటీవల అమెరికాలో విదేశీ విద్యార్థులను స్వల్ప కారణాలకే భారీ సంఖ్యలో స్వదేశానికి పంపించిన వైనం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో, విదేశీ విద్యార్థులు అనేక మంది ఆందోళనకు గురయ్యారు. భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడం మొదలు ట్రాఫిక్ ఉల్లంఘనల వరకూ ఏ చిన్న కారణం దొరికినా విదేశీ విద్యార్థులను స్వదేశానికి పంపించేసేందుకు అక్కడి అధికారులు ప్రయత్నించారు. అయితే, బాధిత విద్యార్థుల్లో కొందరు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి ఊరట పొందారు.


ఇదిలా ఉంటే.. యూదు వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తోందంటూ హార్వర్డ్ యూనివర్సిటీ‌పై గుర్రుగా ఉన్న ట్రంప్.. ప్రభుత్వ నిధులను నిలుపుదల చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. హార్వర్డ్‌కు ఇచ్చిన మూడు బిలియన్ డాలర్ల గ్రాంట్‌ను ట్రేడ్ స్కూల్స్‌కు మళ్లించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు ప్రకటించారు. ఇక విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుండా హార్వర్డ్‌పై ట్రంప్ విధించిన నిషేధం కూడా కోర్టులో బెడిసి కొట్టింది. ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏటా దాదాపు 100 దేశాలకు చెందిన సుమారు 6800 మంది హార్వర్డ్ యూనివర్సిటీలో చేరుతుంటారు. ఒక్క కలం పోటుతో వీరి భవితవ్యాన్ని ట్రంప్ ప్రభుత్వం చిక్కుల్లో పడేసిందని యూనివర్సిటీ మండిపడింది.

ఇవి కూడా చదవండి:

భారతీయుల ఈమెయిల్స్‌కు రిప్లై ఇవ్వను.. న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

హార్వర్డ్ యూనివర్సిటీకి కోర్టులో ఊరట.. ట్రంప్ స్పీడుకు బ్రేకులు

Read Latest and NRI News

Updated Date - May 27 , 2025 | 01:56 PM