Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీకి కోర్టులో ఊరట.. ట్రంప్ స్పీడుకు బ్రేకులు
ABN , Publish Date - May 23 , 2025 | 10:20 PM
హార్వర్డ్ యూనివర్సిటీకి కోర్టులో ఊరట దక్కింది. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్ల నిలుపుదల చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నానికి కోర్టు బ్రేకులు వేసింది. అడ్మిషన్ల నిషేధిస్తూ గతంలో ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేసిందది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టు జడ్జ్ ఆలిసన్ బరోస్ ఆదేశాలు జారీ చేశారు.
ట్రంప్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హార్వర్డ్ యూనివర్సిటీని ఆశ్రయించింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగం, ఇతర చట్టాలను ఉల్లంఘించడమేనని వాదించింది. విదేశీ విద్యార్థుల అడ్మిషన్ల నిలిపివేతతో యూనివర్సిటీలోని 7 వేల మంది వీసాదారులపై తక్షణం తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క సంతకంతో ట్రంప్ ప్రభుత్వం.. హార్వర్డ్ యూనిర్సిటీలో ఓ విద్యార్థి వర్గం మొత్తాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసిందని వ్యాఖ్యానించింది. హార్వర్డ్ లక్ష్యాలకు విదేశీ విద్యార్థులు ఎంతో పాటుపడతారని పేర్కొంది. విదేశీ విద్యార్థులు లేని హార్వర్డ్ యూనివర్సిటీ తన అస్థిత్వాన్నే కోల్పోతుందని పేర్కొంది.
తన విధానాలను వ్యతిరేకిస్తున్న యూనివర్సిటీలు, న్యాయవాద సంస్థలు, మీడియా సంస్థలు, కోర్టులు, ఇతర వ్యవస్థలను తన దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల నిరసనలకు దిగుతున్న విదేశీ విద్యార్థులు అనేక మందిపై దేశ బహిష్కరణ వేటు వేసింది. ట్రంప్ వ్యతిరేక లాయర్లను నియమించుకున్న న్యాయవాద సంస్థలకు కుూడా చుక్కలు చూపించడం ప్రారంభించింది.
ఈ క్రమంలో కొన్ని యూనివర్సిటీలు ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గాయి. యూదు వ్యతిరేకతను తగ్గించేందుకు, సిలబస్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించాయి. మరికొన్ని యూనివర్సిటీలు మాత్రం ట్రంప్‌పై న్యాయపోరాటం ప్రారంభించాయి. ఇక ట్రంప్ ప్రభుత్వ విధానాలకు మద్దతు పలికే వారికి ఉచిత న్యాయ సేవలు అందించేందకు కూడా సిద్ధమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు