SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
ABN , Publish Date - May 05 , 2025 | 08:15 PM
తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ రియాధ్ అధ్యక్షురాలిగా చేతనను నియమించినట్లుగా సాటా అధ్యక్షుడు మల్లేశన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ రియాధ్ అధ్యక్షురాలిగా చేతనను నియమించినట్లుగా సాటా అధ్యక్షుడు మల్లేశన్ ఒక ప్రకటనలో తెలిపారు. రియాధ్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా తెలుగు ప్రవాసీయులకు సేవలందిస్తున్న తమ సంఘం రియాధ్ శాఖ అధ్యక్షురాలిగా వ్యూహాత్మకంగా ఒక మహిళను ఎంపిక చేసినట్లుగా ఆయన వెల్లడించారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో అగ్ర భాగాన ఉండి ఆంధ్రులకు సేవలందించిన నేపథ్యం కలిగిన చేతనకు రియాధ్ లోని తెలుగు ప్రవాసీ లోకం చేయూతనివ్వాలని మల్లేశన్ కోరారు. చేతన ఇప్పటి వరకు సాటా అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం ఉందని ఆయన వివరించారు.
మహిళ సాధికారికతకు పెద్ద పీట వేసే సాటా ప్రవాసీ మహిళలకు సముచితంగా గౌరవిస్తూ సంఘం కార్యకలాపాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి అవకాశం ఇస్తుందని మల్లేశన్ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా సౌదీలోని తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సాంస్కృతిక పునర్వికాసానికి సాటా నిరంతరం పాటుపడుతుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్