NRI: ఆసుపత్రిలో అచేతన స్థితి నుండి మాతృభూమికి..
ABN, Publish Date - May 12 , 2025 | 08:28 PM
అనారోగ్యంతో బాధపడుతూ గత కొన్ని నెలలుగా స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి నిరీక్షిస్తున్న ఒక తెలంగాణ ప్రవాసీ ఎట్టకేలకు మాతృభూమికి పయనమయ్యాడు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతూ గత కొన్ని నెలలుగా స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి నిరీక్షిస్తున్న ఒక తెలంగాణ ప్రవాసీ ఎట్టకేలకు మాతృభూమికి పయనమయ్యాడు.
నిజామాబాద్ జిల్లా జాక్రన్ పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన 38 ఏళ్ళ ముగ్గిడి బాలకిషన్ సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో ఒక ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి కింద పడి ఉండడంతో అతడిని సౌదీ యాజమాని ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స చేయించడంతో ప్రాణం దక్కింది.
మరోవైపు తమ పెద్ద దిక్కైన బాలకిషన్‌ను రప్పించాలని కుటుంబ సభ్యులు ఆర్మూరు శాసన సభ్యుడు పైడి రాకేశ్ రెడ్డిని కోరారు. దీంతో ఆయన భారతీయ ఎంబసీ అధికారులతో పాటు సౌదీలోని సామాజిక సేవకులను సంప్రదించి బాలకిషన్‌ను రప్పించడానికి ప్రయత్నాలు చేశారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్.. ఎంబసీ, సౌదీ యజమానితో సమన్వయం చేసి సోమవారం బాలకిషన్‌ను స్వదేశానికి పంపించారు.
బాలకిషన్‌ను స్వదేశానికి తిరిగి పంపించడంలో సహకరించిన భారతీయ ఎంబసీ, సౌదీ కఫీలుకు జబ్బార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
Updated Date - May 12 , 2025 | 11:04 PM