ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TANA Flag Hoisted On Mount Elbrus: ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం

ABN, Publish Date - Aug 23 , 2025 | 08:20 PM

TANA Flag Hoisted On Mount Elbrus: అమెరికాలో మొట్టమొదటిసారిగా వాల్మీకి రామాయణం తెలుగులో బోధించడానికి తానా సన్నాహాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పతాకాన్ని ఎగురవేశారు. తానా శ్రీకారం చుట్టిన గొప్ప కార్యక్రమం అందరి దృష్టిలో పడేలా చేశారు.

TANA Flag Hoisted On Mount Elbrus

ఎల్బ్రస్‌ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం రెపరెపలాడింది. తానా బోర్డ్‌ డైరెక్టర్లు నాగేంద్ర, శ్రీనివాస్‌ కొడాలి, జానీ నిమ్మలపూడిలు రష్యాలోని ఏడు శిఖరాల్లో అత్యంత ఎత్తైన పర్వతమైన ఎల్బ్రస్‌ (Mount Elbrus) పై తానా విశ్వ గురుకులం పతాకాన్ని ఎగురవేశారు. అమెరికాలో మొట్టమొదటిసారిగా వాల్మీకి రామాయణం తెలుగులో బోధించడానికి తానా సన్నాహాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పతాకాన్ని ఎగురవేశారు. తానా (TANA) శ్రీకారం చుట్టిన గొప్ప కార్యక్రమం అందరి దృష్టిలో పడేలా చేశారు.

విశ్వ గురుకులంలో వాల్మీకి రామాయణం తరగతులు సెప్టెంబర్‌ నుంచి మొదలవుతున్నాయి. ధర్మం అంటే కర్తవ్యాలను నిబద్ధతతో, నైతికతతో నిర్వహించడం. ఈ ధర్మగుణాలను నేటి తరం వారికి అందించాలనే ఉద్దేశ్యంతో రామాయణం వంటి ఇతిహాసాల్లోని విలువలను పరిచయం చేసే కథా ప్రయాణం ఇదని తానా నాయకులు తెలిపారు. 5 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు ఒక సెషన్‌, 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మరో సెషన్‌ ఏర్పాటు చేశారు.

అలాగే 18 సంవత్సరాల వయస్సు గలవారికి జీవన విధానం ఎలా ఉండాలో రామాయణ పాఠాల ద్వారా నేర్పనున్నారు. ఇలా మంచి విషయాలను బోధించే ఈ విశ్వగురుకులంలో చేరాల్సిందిగా తానా నాయకులు తెలుగు కమ్యూనిటీకి విజ్ఞప్తి చేశారు. ఆసక్తి గలవారు https://events.tana.org/event/viswa-gurukulam-2025 లింక్ ద్వారా నమోదు చేసుకోగలరు.

ఇవి కూడా చదవండి

కరాటే కళ్యాణిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ఈ సారి వినాయక చవితి చాలా ప్రత్యేకం.. 500 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం..

Updated Date - Aug 23 , 2025 | 08:25 PM