ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

New Zealand Minister Controversy: భారతీయుల ఈమెయిల్స్‌కు రిప్లై ఇవ్వను.. న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ABN, Publish Date - May 27 , 2025 | 11:58 AM

భారతీయుల నుంచి వచ్చే ఈమెయిల్స్‌‌కు స్పందించనంటూ న్యూజిలాండ్ వలసల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలుపై వివాదం చెలరేగుతోంది.

New Zealand immigration controversy

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల ఈమెయిల్స్‌కు (Spam Mail) తాను సమాధానం ఇవ్వనంటూ న్యూజిలాండ్‌ ఇమిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్‌ఫర్డ్ (Erica Stanford) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై అక్కడి భారత సంతతి ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలు నిర్లక్ష్యం, వివక్ష పూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల కోసం వ్యక్తిగత ఈమెయిల్ అకౌంట్ వినియోగించడంపై మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగత అకౌంట్ ద్వారా జరిపిన అధికారిక లేఖలన్నీ రికార్డుల్లో నమోదయ్యాయా అని లేబర్ పార్టీ ఎంపీ విల్లో జీన్ ప్రైమ్ మంత్రిని ప్రశ్నించారు.


దీనికి మంత్రి స్పందిస్తూ..‘నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించా. ఈమెయిల్స్ అన్నీ అధికారికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నా. నా పార్లమెంటరీ ఈమెయిల్ అడ్రస్‌కు ఫార్వర్డ్ చేశా. అయితే, వలసలపై సలహాలు కోరుతూ భారతీయుల నుంచి భారీగా ఈమెయిల్స్ వస్తుంటాయి. వీటికి నేను అస్సలు స్పందించను. వీటిని స్పామ్‌గా పరిగణిస్తాను’ అని ఆమె అన్నారు.

మంత్రి వ్యాఖ్యలపై భారత సంతతి ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ వేదికగా ఈ అంశంపై మండిపడ్డారు. ‘మంత్రి ఎరికా ఓ దేశం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి చెడు అభిప్రాయం కలిగే వ్యాఖ్యలు చేయడం నన్ను ఎంతో బాధించింది. కాబట్టి, మీరు భారతీయులైతే ఆమెకు అస్సలు ఈమెయిల్ చేయొద్దు.. అవన్నీ ఆటోమేటిక్‌గా బుట్టదాఖలవుతాయి. భారత్‌తో దౌత్యబంధాలు బలోపేతం చేస్తామని మాత్రం ప్రభుత్వం చెప్పుకుంటోంది’’ అని కామెంట్ చేశారు. ఒక దేశం లేదా ప్రజలపై తప్పుడు అభిప్రాయం వేళ్లూనుకునేలా మంత్రి కామెంట్స్ ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు.


ఈ కాంట్రవర్సీపై మంత్రి వివరణ ఇచ్చారు. భారతీయుల ఈమెయిల్స్ స్పామ్ అని తాను ఎప్పుడూ అనలేదని చెప్పారు. దాదాపు స్పామ్ లాగా మాత్రమే చూస్తానని చెప్పుకొచ్చారు. ఇతరుల నుంచి ఇబ్బడిముబ్బడిగా వచ్చే అంవాఛిత ఈమెయిల్స్‌ను స్పామ్ అంటారన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు

హార్వర్డ్ యూనివర్సిటీకి కోర్టులో ఊరట.. ట్రంప్ స్పీడుకు బ్రేకులు

Read Latest and NRI News

Updated Date - May 27 , 2025 | 12:05 PM