ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Canada: కెనడాలో భారతీయ యువతి మృతి.. వెల్లడించిన కాన్సులేట్ కార్యాలయం

ABN, Publish Date - Jun 20 , 2025 | 10:19 AM

కెనడాలో చదువుకుంటున్న ఢిల్లీ యువతి తాన్యా త్యాగీ కన్నుమూశారు. ఈ విషయాన్ని వాంకూవర్‌లోని కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. ఆమె మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Tanya Tyagi death Canada

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి కన్నుమూశారు. వాంకూవర్‌లోని కాన్సులేట్ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. మృతురాలు ఢిల్లీకి చెందిన తాన్యా త్యాగీగా గుర్తించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో చదువుకుంటున్నారు. అయితే, యువతి మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ నేపథ్యంలో కాన్సులేట్ కార్యాలయం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. తాన్యా మృతికి సంతాపం తెలిపింది. అసలేం జరిగిందీ తెలుసుకునేందుకు కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.

తాన్యా మృతిపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. తాన్యా గుండె పోటుతో మృతి చెందిందని అన్నారు. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయపడాలని యువతి కుటుంబసభ్యులు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే, అధికారులు మాత్రం ఏ విషయాన్నీ ధ్రువీకరించలేదు.

ఈ ఏడాది మార్చిలో భారత సంతతి అమెరికా యువతి అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారిన విషయం తెలిసిందే. పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న సుధీక్షా కోనంకి డొమినికన్ రిపబ్లిక్‌లో ఫ్రెండ్స్‌తో విహారయాత్రకు వెళ్లిన సందర్భంలో కనిపించకుండా పోయింది. మార్చి 6న అక్కడి బీచ్‌లో ఆమె చివరిసారిగా కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అసలు ఏం జరిగిందీ తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి.

ఆమె మరణాన్ని అధికారికంగా ప్రకటించాలని యువతి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అయితే, డొమినికన్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం, అదృశ్యమైన నాటి నుంచి నాలుగేళ్ల తరువాత కూడా ఆచూకీ లభించని పక్షంలోనే యువతి మరణాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

ఇవీ చదవండి:

అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌ లైన్ ఏర్పాటు

Read Latest and NRI News

Updated Date - Jun 20 , 2025 | 11:11 AM