ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kerala CM Pinarayi Vijayans Gulf Tour: కేరళ ముఖ్యమంత్రి గల్ఫ్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ

ABN, Publish Date - Oct 12 , 2025 | 08:57 PM

విశ్వవ్యాప్తంగా తమ రాష్ట్ర ప్రవాసీయులలో మలయాళీ భాష వ్యాప్తి, ప్రవాసీయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నంలో భాగంగా పినరయి విజయన్ తలపెట్టిన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది.

Kerala CM Pinarayi Vijayans Gulf Tour

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: గల్ఫ్ దేశాల పర్యటన ద్వారా ఎడారి దేశాలలోని ప్రవాసీ మలయాళీలను కలుసుకోవడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ప్రయత్నాలను కేంద్రం అడ్డుకుంది. విశ్వవ్యాప్తంగా తమ రాష్ట్ర ప్రవాసీయులలో మలయాళీ భాష వ్యాప్తి, ప్రవాసీయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నంలో భాగంగా ఆయన తలపెట్టిన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది.

ఈనెల 16వ తేదీన బహ్రెయిన్.. 17,18, 19 తేదీలలో సౌదీ అరేబియాలో 24, 25 తేదీలలో ఒమాన్‌లో.. ఖతర్‌లో ఒక రోజు.. కువై‌ట్‌లో ఒక రోజు.. దుబాయిలో ఒక రోజు.. ఆబుధాబిలో ఒక రోజు చొప్పున సుదీర్ఘ పర్యటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖరారు చేసుకున్నారు. గత సంవత్సరం కూడా సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆయన చేసిన అభ్యర్ధనను కేంద్రం తిరస్కరించింది.

సరిగ్గా ఇదే 24, 25 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయి, ఆబుధాబిల పర్యటనలకు మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వడమే కాకుండా దుబాయిలో ప్రవాసీయులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రకాలుగా సహాయసహకారాలందిస్తోంది. వాస్తవంగా, వచ్చే నెలలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలు.. వచ్చే సంవత్సరం జరగనున్న రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ది కొరకు ముఖ్యమంత్రి విజయన్ గల్ఫ్ దేశాల పర్యటనను సిద్ధం చేశారనే అభిప్రాయం నెలకొని ఉంది. అంతకు ముందు ఆయన చేసిన దుబాయి పర్యటనలలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో బలీయమైన శక్తులుగా ఉన్న మలయాళీ రాజకీయ ప్రత్యర్ధుల ప్రాబల్యాన్ని నియంత్రించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.

ఇవి కూడా చదవండి

యువకుడి కొంప ముంచిన యువతి.. బార్‌కు తీసుకెళ్లి..

ఎన్డీయే డీల్ ఓకే.. జేడీయూ-బీజేపీ చెరిసగం..

Updated Date - Oct 12 , 2025 | 10:17 PM