Share News

Bihar Assembly Elections: ఎన్డీయే డీల్ ఓకే.. జేడీయూ-బీజేపీ చెరిసగం..

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:47 PM

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బిహార్ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపులను స్వాగతించినట్టు కూటమి నేతలు వెల్లడించారు. తమ కూటమి బిహార్‌లో తిరిగి అధికారం చేపట్టగలదనే ధీమాను వ్యక్తం చేశారు.

Bihar Assembly Elections: ఎన్డీయే డీల్ ఓకే.. జేడీయూ-బీజేపీ చెరిసగం..
NDA final seat sharing in Bihar Elections

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయే (NDA) భాగస్వాముల మధ్య ఆదివారం నాడు సీట్ల షేరింగ్ ఫార్ములా ఖరారైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా సామాజిక మాధ్యమంలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ సీట్ల మెుత్తం సంఖ్య 243 కాగా.. భారతీయ జనతా పార్టీ (BJP), జనతా దళ్ యునైటెడ్ (JDU) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. అలాగే భాగస్వామ్య పార్టీలైన లోక్‌జన్ శక్తి (Ram Vilas)కు 29 సీట్లు కేటాయించారు. రాష్ట్రీయ లోక్‌ మోర్చా (RLM)కు 6 సీట్లు, హిందుస్థాన్ అవామీ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించారు.


ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ కేటాయింపులను స్వాగతించినట్టు కూటమి నేతలు వెల్లడించారు. తమ కూటమి బిహార్‌లో తిరిగి అధికారం చేపట్టగలదనే ధీమాను వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 6, 11 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

మంత్రి పదవిని వదులుకుంటా

ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

For More National News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 07:04 PM