Home » JDU
నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా ఆయన గవర్నర్‌కు అందజేస్తారు.
బిహార్ బాహుబలి నేత అనంత్ కుమార్ సింగ్ ఓ మర్డర్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నా కూడా ఆయనే అత్యధిక మెజార్టీతో మొకామా నుంచి విజయం సాధించారు.
శుక్రవారంనాడు జరిగిన కౌంటింగ్‌లో అనంత్ సింగ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థి వీణాదేవిపై ఆయన గెలిచారు.
మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు.
పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్‌లు చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , ముఖ్యమంత్రి, జనతాదళ్ నేత నితీష్ కుమార్ శుక్రవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కూటమి 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు.
బిహార్‌లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని, ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ తెలిపారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు.
మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రియదర్శి పీయూష్ పోటీలో ఉన్నారు. మోకామా 2005 నుంచి సింగ్‌కు కంచుకోటగా ఉంది.
పార్టీ అధికార ప్రకటన ప్రకారం, బహిష్కరణ వేటు పడిన నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, మాజీ మంత్రి శైలేష్ కమార్, మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
బిహార్‌లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్‌లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.