Bihar Elections: తప్పుడు ఉద్యోగ వాగ్దానాలతో యువతను ఫూల్స్ చేస్తున్నారు: నితీష్ మండిపాటు
ABN , Publish Date - Oct 28 , 2025 | 07:46 PM
బిహార్‌లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని, ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ తెలిపారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు.
పాట్నా: ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి పేరుతో విపక్షాలు బూటకపు వాగ్దానాలు చేస్తూ ప్రజలను తప్పదారి పట్టిస్తున్నాయని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) అన్నారు. ఇంటింటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగమంటూ విపక్ష 'మహాగట్‌బంధన్' మంగళవారం నాడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో విపక్షాల తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాయంటూ నితీష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు.
'మహాకూటమి ప్రభుత్వం 15 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పుడు యువతకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు. విపక్షాల చెబుతున్న మాయమాటల భ్రమలో పడవద్దని ప్రజలను కోరుతున్నారు. మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకోండి. ఇకముందు కూడా అభివృద్ధిని కొనసాగిస్తాం. చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం' అని నితీష్ పేర్కొన్నారు.
బిహార్‌లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని.. ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ గుర్తుచేశారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు. ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేవారు కాదని, ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉండేదని అన్నారు. పనిచేసే వాతావరణం కానీ, సౌకర్యాలు కానీ, నెలవారీ జీతాలు, పింఛన్లు వచ్చేవి కావని తెలిపారు. జీతాల కోసం ఆరు నెలలపాటు ఎదురు చూపులు, వేతనాలు, పెన్షన్ల కోసం నిరసనలు చోటుచేసుకునేవని అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తులు అధికారం కోసం తప్పుడు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం 2005 నుంచి 2020 వరకూ 8 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ
ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి