MCD Bypolls: ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:28 PM
ఉపఎన్నికలు జరుగనున్న వార్డుల్లో ముండ్కా, షాలిమార్ మార్గ్-బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, ద్వారకా-బి, డిచావు కలాన్, నారాయణ, సంగమ్ వివార్-ఎ, దక్షిణ్ పూరి, గ్రేటర్ కైలాష్, వినోద్ నగర్ ఉన్నాయి.
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCC)కి చెందిన 12 వార్డుల్లో ఉప ఎన్నికల తేదీలను ఢిల్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మంగళవారంనాడు ప్రకటించింది. నవంబర్ 30న పోలింగ్ నిర్వహిస్తామని, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయని ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఉప ఎన్నికల కోసం నవంబర్ 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నవంబర్ 10వ తేదీతో నామినేషన్ల దాఖలు గడవు ముగుస్తుంది. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15తో మగుస్తుంది. నవంబర్ 30వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఎలాంటి బ్రేక్ లేకుండా పోలింగ్ జరుగుతుంది.
బైపోల్ నిర్వహించే వార్డులివే..
ఉప ఎన్నికలు జరుగనున్న వార్డుల్లో ముండ్కా, షాలిమార్ మార్గ్-బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, ద్వారకా-బి, డిచావు కలాన్, నారాయణ, సంగమ్ వివార్-ఎ, దక్షిణ్ పూరి, గ్రేటర్ కైలాష్, వినోద్ నగర్ ఉన్నాయి. షాలిమార్ బాగ్-బి వార్డుకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గతంలో ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ కౌన్సిలర్ కమల్‌జీత్ సెహ్రావత్ పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్‌సభకు గెలవడంతో ద్వారకా-బి వార్డుకు ఖాళీ ఏర్పడింది. బీజేపీ, ఆప్‌కు చెందిన పలువురు ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు కావడంతో తక్కిన వార్డుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.
ఇవి కూడా చదవండి..
ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి