ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:21 PM
ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకోరాదు. అలా చేసినట్లయితే సెక్షన్ 31 కింద ఏడాది జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore)కు ఎన్నికల కమిషన్ (EC) మంగళవారంనాడు షోకాజ్ నోటీసు ఇచ్చింది. బిహార్‌తో పాటు పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితాలోనూ ఆయన పేరు కనిపించడంతో ఈసీ ఈ చర్యలకు దిగింది.
బిహార్‌లో రోహటాస్ జిల్లా ససరాంలోని కర్గాహార్ అసెంబ్లీ నియోజవవర్గం రిటర్నింగ్ అధికారి ఈ నోటీసులు పంపారు. కర్గాహార్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 621లో ఎపిక్ (ఓటర్ ఐడి) నంబర్ 1013123718 కింద ఓటరుగా ఆయన పేరు నమోదైందని, ఇదే సమయంలో పశ్చిమబెంగాల్‌లోని భాబనిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సెయింట్ హెలెన్ స్కూలు పోలింగ్ బూత్‌లో కూడా ఆయన పేరు నమోదై ఉందని ఆ నోటీసులో రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకోరాదు. అలా చేసినట్లయితే సెక్షన్ 31 కింద ఏడాది జైలు లేదా జరిమానా.. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.
రెండు వేర్వేరు రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో పేర్ల నమోదుపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల కమిషన్ కోరింది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున ఈసీ నోటీసులపై ప్రశాంత్ కిషోర్ వెంటనే స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం
అసలు ఈ ఎలక్ట్రిక్ బస్సులతోనే సమస్య..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి