Bihar Elections: రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు.. నితీష్ గ్యారెంటీ
ABN , Publish Date - Oct 21 , 2025 | 08:03 PM
బిహార్‌లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్‌లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.
ముజఫర్‌పూర్: రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి 20 ఏళ్లుగా తాము అహరహం శ్రమిస్తున్నామని తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారంనాడు ముజఫర్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇతవరకూ 50 లక్షల మంది యువతకు తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇచ్చితీరుతామని వాగ్దానం చేశారు.
బిహార్‌లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతలు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్‌లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు. ఒకప్పుడు ప్రజలు సాయంత్రం అయితే రోడ్లపైకి వచ్చేందుకే భయపడేవారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి కోసం పనిచేశామని, ఎలాంటి భయాలు, బెదిరింపులకు తావులేని వాతావరణం కల్పించామని చెప్పారు.
గత ఎన్నికల్లో..
కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బలం పెంచుకోగా, మిత్రపక్షమైన జేడీయూ రెండో ప్లేస్‌లో నిలిచింది. బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసి 74 స్థానాల్లో గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేసిన 43 సీట్లు మాత్రమే దక్కించుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ చెరో 101 సీట్లలో సమానంగా పోటీ చేస్తున్నాయి. తక్కిన 41 సీట్లలో ఎన్డీయే మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి