Bihar Elections: జేడీయూ స్ట్రాంగ్‌మాన్ ప్రచారంలో కుప్పకూలిన వేదిక
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:27 PM
మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రియదర్శి పీయూష్ పోటీలో ఉన్నారు. మోకామా 2005 నుంచి సింగ్‌కు కంచుకోటగా ఉంది.
పాట్నా: జనతా దళ్ యునైటెడ్ (JDU) నేత బాహుబలి అనంత్ సింగ్ (Anant Singh)కు బిహార్ ఎన్నికల ప్రచారంలో ఊహించని సంఘటన ఎదురైంది. ఆయన వేదికపై ఉండగా స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. రాంపూర్ డుమ్రా గ్రామంలో ఆయన ప్రచారానికి వెళ్లినప్పుడు ఇది చోటుచేసుకుంది.
అనంత్ సింగ్ మద్దతుదారులు చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి ఆయనను ప్రసంగించాల్సిందిగా కోరారు. 'జేడీయూ జిందాబాద్', 'నితీష్ కుమార్ జిందాబాద్', 'అనంత్ బాబు జిందాబాద్' అంటూ మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా సింగ్ స్టేజ్ పైకి వచ్చారు. అకస్మాత్తుగా స్టేజ్ కుప్పకూలడంతో సింగ్ మద్దతుదారులు వెంటనే ఆయనకు సహాయంగా నిలిచారు. సింగ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
జేడీయూ మోకామా అభ్యర్థి
మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రియదర్శి పీయూష్ పోటీలో ఉన్నారు. మోకామా 2005 నుంచి సింగ్‌కు కంచుకోటగా ఉంది. 2005 నుంచి 2022 వరకూ ఆ సీటుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిగా సింగ్ పోటీ చేశారు. జేడీయూ నేత రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్‌పై అనంత్ సింగ్ 35,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే 2022లో ఆయన బిహార్ అసెంబ్లీ నుంచి అనర్హతకు గురయ్యారు. ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై ఈ అనర్హత వేటుపడింది. ఆ తర్వాత మోకామా ఉప ఎన్నికలో ఆయన భార్య నీలమ్ దేవి గెలిచారు. సింగ్ ప్రస్తుతం జేడీయూలో చేరడంతో మోకామా నుంచి ఆయనకు జేడీయూ టిక్కెట్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి