ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Canada: కెనడాకు వెళ్లాలనుకునే వారు ఈ వీడియో చూడాలి.. దడ పుట్టిస్తున్న భారతీయ యువతి పోస్టు

ABN, Publish Date - Jun 28 , 2025 | 08:39 AM

కెనడాలో ఉద్యోగాల కొరత అధికంగా ఉందంటూ ఓ యువతి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కెనడాకు వద్దామనుకునే వారు ఈ వీడియో చూడాలని ఆమె సూచించారు.

Canada Job Market Reality

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, కెనడా లాంటి దేశాల్లో లైఫ్ అంటే చాలా మందికి మంచి ఉద్యోగావకాశాలు, మెరుగైన లైఫ్ స్టైల్ గుర్తొస్తాయి. ఈ ఆశలు, కలలతో కెనడాకు వద్దామనుకునే వారు ఒక్కసారి తన వీడియో చూడాలంటూ ఓ భారతీయ యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Canada Job Market Reality).

@kanutalescanada పేరిట ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో ఆ యువతి వీడియోను షేర్ చేశారు. కెనడాలో లైఫ్‌పై జనాల్లో సాధారణంగా ఉండే అభిప్రాయం తప్పని చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్యోగం కోసం జనాలు ఎలా క్యూకడుతున్నదీ వీడియోలో రికార్డు చేసి నెట్టింట పెట్టారు. ‘ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్, బంధువులు కెనడాలో చాలా జాబ్స్ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ వీడియో చూపించండి. విదేశాల్లో లైఫ్ ఈజీ అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో చూపించండి’ అని ఆమె అన్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్‌లో కేవలం 6 ఉద్యోగ ఖాళీలు ఉంటే జాబ్ కోసం డజన్ల కొద్దీ అభ్యర్థులు క్యూకట్టారు. తమకు జాబ్ రావొచ్చేమో అన్న ఆశతో క్యూలైన్‌లలో నిలబడ్డారు. ‘కెనడాలో వాస్తవ పరిస్థితి ఇది. ఈ కష్టానికి రెడీ అనుకుంటేనే ఇక్కడకు రండి. లేకపోతే ఇండియాలో ఉండటమే బెటర్’ అని యువతి సూచించారు.

విదేశాల్లో జీవితం అందమైన కలలాంటిది కాదని ఆమె తన వీడియోకు క్యాప్షన్ జత చేశారు. కొన్ని సార్లు లైఫ్ అంటే ఉద్యోగాల కోసం క్యూ కట్టడంగా మారిపోవచ్చని హెచ్చరించారు.

ఇక ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వాస్తవాన్ని చూపించినందుకు అనేక మంది ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కష్టాల గురించి అధికశాతం మంది బయటకు చెప్పుకోరని అన్నారు. కెనడాలో పరిస్థితి ఏంటో తెలిసే వరకూ అంతా దాన్ని అవకాశాల గనిగానే భావిస్తారని పేర్కొన్నారు. అయితే, సరైన నైపుణ్యాలుంటే అక్కడ నిలదొక్కుకోవడం కష్టమేమీ కాదని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో మరీ అతిగా ఉందని మరికొందరు చెప్పుకొచ్చారు. జాబ్స్ కోసం ఎక్కడ అన్వేషించాలో తెలిస్తే అవకాశాలకు కొరతేమీ లేదని అన్నారు.

ఇవీ చదవండి:

అట్లాంటాలో ఫోర్సిత్‌ కౌంటీ షెరీఫ్‌ సిబ్బందికి తానా నాయకుల సత్కారం

అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Read Latest and NRI News

Updated Date - Jun 28 , 2025 | 09:21 AM