ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma Celebrations In North Carolina: నార్త్ కరోలినాలో అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు

ABN, Publish Date - Sep 29 , 2025 | 12:07 PM

కాంకర్డ్ ప్రాంతంలో తెలుగు వారు తక్కువగా ఉన్నప్పటికీ తెలుగు పండుగల సందడి ఎక్కువే అని స్థానికులు చెబుతుంటారు. ఆ మాటను నిజం చేస్తూ గత శనివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు మహిళలు.

Bathukamma Celebrations In North Carolina

అమెరికా: అమెరికాలోని నార్త్‌ కరోలినా కాంకర్డ్ కానన్‌రన్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు (Bathukamma Celebrations) అంబరాన్నంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడేలా పిల్లలు, పెద్దలు కలిసి బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. కాంకర్డ్ ప్రాంతంలో తెలుగు వారు తక్కువగా ఉన్నప్పటికీ తెలుగు పండుగల సందడి ఎక్కువే అని స్థానికులు చెబుతుంటారు. ఆ మాటను నిజం చేస్తూ గత శనివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు మహిళలు. స్థానికంగా దొరికే రంగరంగుల పూలతో అందంగా బతుమ్మలను పేర్చారు.

ఆ తరువాత బతుకమ్మలను ఒక్కచోట చేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. అంతేకాకుండా ఈ ఉత్సవాల్లో స్థానికంగా ఉండే అమెరికన్లను కూడా భాగస్వాములను చేశారు. అక్కడి వారికి కూడా తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేసేలా బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వివరించారు. చివరగా బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి సంబరాలకు ముగింపు పలికారు మహిళలు.

ఇవి కూడా చదవండి..

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో చండీ హోమం

ఘనంగా ముగిసిన శంకర నేత్రాలయ 5కే వాక్

Read Latest NRI News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 12:23 PM