Share News

SDBBS Chandi Homam: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో చండీ హోమం

ABN , Publish Date - Sep 28 , 2025 | 09:19 PM

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ వార్షిక చండీ హోమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

SDBBS Chandi Homam: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో చండీ హోమం
SDBBS Chandi Homam

ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) వార్షిక చండీ హోమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో 28 సెప్టెంబర్ 2025 తేదీన దేవి కృపను స్మరించుకుంటూ చండీ హోమ మహోత్సవం ఘనంగా జరిగింది. సుమారు 350 మంది భక్తులు పాల్గొని, ఈ పవిత్ర హోమం ద్వారా చండీ దేవి అమ్మవారి ఆశీర్వాదాలను పొందారు. దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సభ 30 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తూ వస్తోంది.

గణపతి పూజ, కలశ స్థాపనతో కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం జరిగింది. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మహాత్మ్యం పరాయణ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించారు. పూర్ణాహుతి, దీపారాధన, ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. దేవీ మాహాత్మ్యం ఘోషతో ఆ ప్రాంగణం అంతా పవిత్రతతో నిండిపోయి, భక్తులలో ఆధ్యాత్మిక భావన మేల్కొంది.


సభ తరపున వాలంటీర్లకు సత్కారం నిర్వహించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక, విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాదం పంపిణీ చేశారు. ఎస్‌డీబీబీఎస్ అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణసుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్ మరియు కార్తిక్ లకు అలాగే కార్య‌క్ర‌మానికి తోడ్పడిన అందరి వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

3.jpg4.jpg6.jpg5.jpg

Updated Date - Sep 28 , 2025 | 09:19 PM