ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ATA సహకారం.. తిమ్మాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రహరీ గోడ, ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభం

ABN, Publish Date - Dec 22 , 2025 | 07:57 AM

జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సహకారంతో, సంస్థ బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

America Telugu Association

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఆటా చేస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీదేవి అన్నారు. జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) సహకారంతో, సంస్థ బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రహరీ గోడ, విద్యార్థులకు తాగడానికి ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించడంతో పాటు, ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు షూల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డీఈఓ రాము తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ శ్రీదేవి మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆటా కార్యవర్గ కమిటీకి అభినందనలు తెలిపారు. ఆటా ఈ రోజు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని అన్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు మాతృభూమిపై ప్రేమతో గ్రామీణ విద్యాభివృద్ధికి సహకరించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగేలా చేస్తాయని అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యుడు విష్ణు మాధవరం సొంత నిధులతో ఈ అభివృద్ధి పనులను చేపట్టడం అభినందనీయమని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి సొంత నిధులతో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించినట్లు అవుతుందన్నారు.

ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, ఆటా సేవల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రాంత బిడ్డ విష్ణు మాధవరం తమ టీంలో ఉండటం తమకు గర్వంగా ఉందన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాఠశాల భద్రత మెరుగుపడుతుందని, ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగవుతుందని అన్నారు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు, షూస్ వారి రోజువారీ అవసరాలను తీరుస్తాయని, పేద కుటుంబాల పిల్లలకు ఇది పెద్ద తోడ్పాటని చెప్పారు.

అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డిఇఓ రాము మాట్లాడుతూ, ఆటా సంస్థకు, ముఖ్యంగా విష్ణు మాధవరంకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సీతా లక్ష్మి, తిమ్మాపూర్ సర్పంచ్ పుష్పలత వైకుంఠం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా, ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

తానా ఆధ్వర్యంలో ఛార్లెట్‌లో ఫుడ్‌ డ్రైవ్‌.. సక్సెస్‌

సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ

Read Latest and NRI News

Updated Date - Dec 22 , 2025 | 09:48 AM