ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: ఖతర్‌లో ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ సభ

ABN, Publish Date - Dec 07 , 2025 | 08:27 PM

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు ఖతర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయిన భారత ఎంబసీ దౌత్యవేత్త, ప్రథమ కార్యదర్శి ఈశ్ సింఘాల్ స్థానిక తెలుగు సంఘాలు అభినందించారు. తెలుగు సంస్కృతికి తరువాతి తరాలకు అందించేందుకు సంఘాలు పలు సేవ, సాంస్కృత్రిక కార్యక్రమాలు చేస్తున్నాయని ప్రశంసించారు.

AP Welfare Association Qatar

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమికి దూరంగా ఉంటూ కూడా సొంత మగాణిలో మిశ్రమం కావడం మాతృభూమిపై నిజమైన మమకారం అని అనిపించేలా ఖతర్‌లోని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఖతర్‌లోని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతర తెలుగు సంఘాలు తమ తెలుగు సంస్కృతిని నవ తరాలకు చాటిచెప్పేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడాన్ని భారతీయ ఎంబసీలో సంక్షేమ విధి విధానాలను పర్యవేక్షించే దౌత్యవేత్త, ప్రథమ కార్యదర్శి ఈశ్ సింఘాల్ అభినందించారు. ఆపదలో ఉండే తోటి ప్రవాసాంధ్రులకు చేయూతను ఇవ్వడానికి కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు.

దైనందిన సమస్యలతో సతమతమయ్యే సగటు తెలుగు కార్మికులకు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అందిస్తున్న సహాయాన్ని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం ఐ.సి.బి.యఫ్ అధ్యక్షుడు షానవాస్ బావా ప్రశంసించారు.

ఈ సంవత్సరం ఖతర్‌లో తమ సంఘం పక్షాన చేసిన సేవాకార్యక్రమాలను సంఘం అధ్యక్షుడు నరసింహం జోశ్యుల వివరించారు. తమ తల్లిదండ్రుల ఉపాధి రీత్యా విదేశాలలో పాఠశాల విద్యను అభ్యసించి ఆ తరువాత ఉన్నత విద్య కోసం స్వదేశానికి వెళ్ళే విద్యార్థులకు వైద్య, ఇతర ఉన్నత విద్య కోర్సులలో ప్రవేశాలలో ప్రత్యేక సడలింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తమ సంఘం తరపున విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం అందించామని వివరించారు. అదే విధంగా, నివేశ స్థలాల కేటాయింపులో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని కూడా చెప్పారు. ఈ విషయమై ఇటీవల తమ సంఘం విజయవాడలో ప్రవాసీ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ సి.ఇ.ఓ కృష్ణ మోహన్‌ను కలిసి చర్చించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించిన ప్రవాసాంధ్ర బీమా పథకంలో ఈ సంవత్సరం ఖతర్ నుంచి తాము 200 మంది కార్మికుల బీమా రుసుమును చెల్లించనున్నట్లుగా నరసింహం వెల్లడించారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణ విభాగంలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన చిన్నారులను, భారతీయ వంటకాల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలను సత్కరిస్తూ జ్ఞాపికలను అందజేసారు.

చిన్నారులు, మహిళల నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకోగా స్థానిక గాయకురాలు అనన్య భాస్కర్ తన గేయాలతో సభికులను మంత్రముగ్ధులను చేసింది. వర్జిల్ బాబు తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాల నాయకులు వెంకప్ప భాగవతుల, రజనీమూర్తి, నందిని, శంకర్ గౌడ్, ప్రముఖులు కె.యస్.ప్రసాద్, -కృష్ణ కుమార్, ప్రవాస భారతీయ ప్రముఖులు షానవాస్ బావ, దీపక్ శెట్టి, నిలంబరీ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

ప్రియమైన ఎన్నారై టీడీపీ సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి

Read Latest and NRI News

Updated Date - Dec 09 , 2025 | 06:57 PM