ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Home Gardening Tips: మొక్కలు ఎండిపోతున్నాయా

ABN, Publish Date - Nov 09 , 2025 | 05:17 AM

మనం కుండీల్లో రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటాం. వాటికి రెండుపూటలా నీళ్లు పోస్తూ సమయానుసారం ఎరువులు అందిస్తూ ఎండ తగిలేలా చూసుకుంటూ ఎన్నో జాగ్రత్తలు...

మనం కుండీల్లో రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటాం. వాటికి రెండుపూటలా నీళ్లు పోస్తూ సమయానుసారం ఎరువులు అందిస్తూ ఎండ తగిలేలా చూసుకుంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయినా కూడా మొక్కలు ఎండిపోతూ ఉంటాయి. అలాకాకుండా మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం...

  • చాలామంది.. మొక్కలు బాగా ఎదగాలనే భావనతో కుండీల నిండుగా నీళ్లు పోస్తూ ఉంటారు. దీంతో మట్టి పూర్తిగా నీటితో నిండి గాలి ప్రసరణను అడ్డుకుంటుంది. వేర్లకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో క్రమంగా మొక్కలు ఎండిపోతుంటాయి. కుండీల్లో మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే కొద్దికొద్దిగా నీటిని చిలకరించడం మంచిది. కుండీల అడుగుభాగంలో తప్పనిసరిగా రంధ్రాలు చేయాలి. అప్పుడే కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా బయటికి వెళుతుంది. మొక్కలు పచ్చగా ఎదుగుతాయి.

  • కొన్ని రకాల మొక్కలు పెరగడానికి ఎండ కావాలి. మరికొన్ని మాత్రం నీడలోనే ఎదుగుతాయి. ముందుగా మొక్కల తత్వాన్ని తెలుసుకుని కుండీలను ఎక్కడ ఉంచాలో నిర్ణయించాలి. మనీ ప్లాంట్‌, స్నేక్‌ ప్లాంట్‌ లాంటివి నీడలోనే చక్కగా పెరుగుతాయి. వాటికి ఎండ తగిలితే వెంటనే ఆకులు ఎండిపోతాయి. సక్యులెంట్స్‌, మందారం, ఆర్కిడ్స్‌ లాంటి మొక్కల కుండీలను రోజూ కాసేపు ఎండలో ఉంచాలి. మొక్కలు ఎండిపోతున్నట్లు కనిపించగానే కుండీలను స్థలం మార్చడం మంచిది.

  • కొన్ని మొక్కలు వేగంగా పెరుగుతుంటాయి. వాటికి తగ్గట్టు కుండీలు పెద్దగా లేని పక్షంలో కావాల్సినన్ని పోషకాలు అందక, పెరిగే వేర్లకు స్థలం సరిపోక మొక్కలు ఎండిపోతాయి. మొక్కలు సరిగా ఎదగడంలేదని గమనించిన వెంటనే వాటిని పెద్ద కుండీల్లోకి మార్చాలి.

  • మొక్కల పెరుగుదలకు ఎరువులు తప్పనిసరి. రసాయనాలతో కూడిన ఎరువులు కాకుండా కంపోస్టు, ఆవుపేడ, పండ్ల తొక్కలు, వంటింటి వ్యర్థాలను మట్టిలో చేరుస్తూ ఉంటే మొక్కలు ఎండిపోకుండా పచ్చగా ఎదుగుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

ఓటు హక్కుని బీజేపీ కాలరాస్తోంది.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2025 | 05:17 AM