Kidney Disease Signs: ఈ లక్షణాలు ప్రమాదకరం
ABN, Publish Date - Aug 26 , 2025 | 12:41 AM
మూత్రపిండాల సమస్యలు కొన్ని ప్రధాన లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. కానీ సాధారణంగా మనం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే కొన్ని కీలకమైన సంకేతాలను పసిగట్టగలిగితే, ముంచుకొచ్చే ముప్పును...
కిడ్ని కేర్
మూత్రపిండాల సమస్యలు కొన్ని ప్రధాన లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. కానీ సాధారణంగా మనం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే కొన్ని కీలకమైన సంకేతాలను పసిగట్టగలిగితే, ముంచుకొచ్చే ముప్పును ముందస్తుగానే గుర్తించవచ్చని అంటున్నారు సికె బిర్లా హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ మోహిత్ ఖిర్బత్.
మూత్రవిసర్జన: మూత్రవిసర్జనలో మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రం పెరిగినా, తగ్గినా, మూత్రం రాకపోతున్నా, మూత్రంలో నురగ కనిపిస్తున్నా మూత్రపిండాలు ముప్పలో పడ్డాయని అర్థం
నీరసం: మూత్రపిండాలు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్‌ను సమకూరుస్తాయి. మూత్రపిండాల సామర్థ్యం దెబ్బతిన్నప్పుడు, హార్మోన్ క్షీణించి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సన్నగిల్లి, రక్తహీనతతో నీరసం ఆవరిస్తుంది
పాదాలు, చేతుల వాపులు: మూత్రపిండాలు ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో నీరు నిలిచి పోతుంది. దాంతో కాళ్లు, చేతుల వాపులు కనిపిస్తాయి
కళ్ల వాపు: ప్రొటీన్ నష్టం దెబ్బతిన్న మూత్రపిండాలకు సూచన. దకళ్ల చుట్టూరా తలెత్తే వాపు ప్రొటీన్ నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు
శ్వాస సమస్య: మూత్రపిండాలు ఒత్తిడికి లోనవడం వల్ల, ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి లేదా రక్తహీనత వల్ల విశ్రాంత స్థితిలో సైతం ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది
దురదలు: ఆరోగ్యకరమైన మూత్రపిండాలు వ్యర్థాలను వడగట్టి విసర్జనకు తోడ్పడతాయి. అవి దెబ్బతిన్నప్పుడు, వడపోతకు ఆటంకం ఏర్పడి, చర్మం పొడిబారుతుంది. దురదలు వేధిస్తాయి
వెన్ను నొప్పి: వెన్ను లేదా పక్కటెముల నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు కిడ్నీల్లో రాళ్లు, ఇన్‌ఫెక్షన్లకు సూచనలు
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..
Updated Date - Aug 26 , 2025 | 12:41 AM