Unusual Child Symptoms: ఈ అసహజ లక్షణాలు ఎందుకు
ABN, Publish Date - Aug 21 , 2025 | 05:28 AM
డాక్టర్! మా బాబుకు పదేళ్లు. మిగతా పిల్లలతో పోలిస్తే బాబు శిశ్నం మరీ చిన్నదిగా, ఉందా లేదన్నట్టుగా ఉంది. వృషణాల ఎదుగుదల కూడా చాలా తక్కువ. భౌతిక లక్షణాలే కాకుండా బాబు ప్రవర్తన కూడా ఆడపిల్లల్లాగే ఉంది....
కౌన్సెలింగ్
డాక్టర్! మా బాబుకు పదేళ్లు. మిగతా పిల్లలతో పోలిస్తే బాబు శిశ్నం మరీ చిన్నదిగా, ఉందా లేదన్నట్టుగా ఉంది. వృషణాల ఎదుగుదల కూడా చాలా తక్కువ. భౌతిక లక్షణాలే కాకుండా బాబు ప్రవర్తన కూడా ఆడపిల్లల్లాగే ఉంది. అదే ఈడు మగపిల్లల్లా కాకుండా ఆడపిల్లలని మరిపిస్తున్నాడు. వాడి పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఏం చేయమంటారు?
ఓ సోదరి, వరంగల్.
మీరు చెప్పిన లక్షణాలు అసహజంగానే అనిపిస్తున్నాయి. అయితే ఇంత చిన్న వయసులో కేవలం లక్షణాల ఆధారంగా పిల్లల జెండర్‌ను నిర్ధారించడం సరికాదు. అలాగని అలక్ష్యం కూడా చేయకూడదు. బాబుకు పుట్టుకతో సంక్రమించిన జెండర్‌ను తెలుసుకోవాలనుకుంటే క్రోమోజెమ్ అనాలసిస్ పరీక్ష ‘కార్యోటైపింగ్’ చేయించాలి. ఈ పరీక్షలో బాబు క్రోమోజోమ్స్‌నుబట్టి ఆడా, మగా? అన్నది కచ్చితంగా నిర్ధారించవచ్చు. ఒకవేళ పరీక్షలో ఎక్స్, వై అనే పురుష క్రోమోజోములు ఉండి, లక్షణాలు మాత్రమే విరుద్ధంగా ఉంటే, యుక్తవయసుకు చేరుకునేవరకూ ఆగక తప్పదు. 18 ఏళ్ల వయసుకు బాబుకు నిర్దిష్ట వ్యక్తిత్వం రూపుదిద్దుకున్న తర్వాత సైకియాట్రిస్టు, ఆండ్రాలజి్‌స్టల సహాయంతో మరికొన్ని కీలక పరీక్షలు జరిపి, తర్వాతే సెక్సువల్ ఓరియెంటేషన్ అవసరాన్ని గమనించాలి. కొంతమంది పురుష క్రోమోజోములతో మగపిల్లలుగానే పుట్టినా పెంపక లోపాల వల్ల, పరిసరాల ప్రభావం కారణంగా ఆడపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలను కౌన్సెలింగ్‌తో సరిచేయవచ్చు. ఒకవేళ బాబుకు పరీక్షల్లో ఎక్స్, ఎక్స్ క్రోమోజోములు ఉన్నాయని తేలితే, దాన్ని జన్యుపరమైన లోపంగా భావించి, 18 ఏళ్లు దాటిన తర్వాత అవసరాన్నిబట్టి, మనస్తత్వం, వ్యక్తిత్వం, నిర్ణయాల ఆధారంగా సర్జరీ చేయించవచ్చు. ఈ పరిస్థితి ఆడపిల్లల్లో కూడా ఉంటుంది.
సెక్సువల్ ఓరియెంటేషన్ సర్జరీ
ఇది ఎంతో సంక్లిష్టమైన సర్జరీ! కృత్రిమ యోని, పురుషాంగాలను నిర్మించి, అవసరమైన హార్మోన్లను అందించే సర్జరీ ఇది. ఈ సర్జరీ ద్వారా రూపొందించిన మర్మాంగాలు నూటికి నూరు శాతం సహజసిద్ధంగా పని చేస్తాయని అనుకోకూడదు. పురుషాంగం నిర్మించగలిగినా అది అన్ని విధాలుగా ఉపయోగపడకపోవచ్చు. అలాగే యోని కూడా! అవసరమైన కండరాలను దగ్గరకు చేర్చి, యోని నిర్మాణం జరిగినా, దాన్ని డైలేటర్లతో క్రమం తప్పక వెడల్పు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఎన్నో ఇబ్బందులను జీవితాంతం భరించక తప్పదు. కాబట్టి సెక్సువల్ ఓరియెంటేషన్ సర్జరీకి ముందు వైద్యులు సదరు వ్యక్తులకు, కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తారు. దాంతో కొందరు సర్జరీతో అవసరం లేకుండా అలాగే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటే, మరికొందరు సర్జరీకి ఆసక్తి కనబరుస్తారు. ఇదంతా అనుభవజ్ఞులైన మానసిక నిపుణులు, ఆండ్రాలజిస్ట్, సెక్సువల్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో సాగుతుంది.
డాక్టర్ రాహుల్ రెడ్డి
ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News
Updated Date - Aug 21 , 2025 | 05:35 AM