ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Designer Sharara Trends: షరారాషరారా

ABN, Publish Date - Nov 26 , 2025 | 01:34 AM

వేడుకల్లో లెహంగా, శారీ్‌సను ఎంచుకోడానికి వెనకాడేవారు నిరభ్యంతరంగా షరారాలను ఎంచుకోవచ్చు. సౌకర్యం, స్టైల్‌కు పెద్ద పీట వేసే డిజైనర్‌ షరారాలు అన్ని వేడుకలకూ అనువుగా...

ఫ్యాషన్‌

వేడుకల్లో లెహంగా, శారీ్‌సను ఎంచుకోడానికి వెనకాడేవారు నిరభ్యంతరంగా షరారాలను ఎంచుకోవచ్చు. సౌకర్యం, స్టైల్‌కు పెద్ద పీట వేసే డిజైనర్‌ షరారాలు అన్ని వేడుకలకూ అనువుగా ఉంటాయి. తాజాగా ట్రెండ్‌ అవుతున్న వాటి మీద ఓ లుక్కేద్దాం!

పండుగలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు.. ఇలా అన్ని రకాల వినోదాల్లో ధరించడానికి వీలుండే దుస్తులు.. డిజైనర్‌ షరారాలు. ప్రస్తుతం ఇవి ట్రెండ్‌గా మారాయి. డిజైనర్లు ఆధునికత ఉట్టిపడే డిజైనర్‌ వెర్షన్లను రూపొందిస్తూ ఉండడంతో, కొత్త కొత్త హంగులతో, ఫ్యూజన్‌ స్టైల్స్‌తో షరారాలు మహిళల మనసులను దోచుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా వధువులు కూడా రిసెప్షన్స్‌, ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్ల కోసం డిజైనర్‌ షరారాలనే ఎంచుకుంటూ ఉండడం చెప్పుకోదగిన విశేషం. జారుతున్నట్టు క నిపించే మెటీరియల్స్‌, రిల్యాక్స్‌డ్‌ ఫిట్టింగ్స్‌తో రూపొందుతున్నాయి కాబట్టి వీటిని ధరించడమూ సులభమే! ప్రత్యేకించి లెహంగాలతో పోలిస్తే షరారాలతో రెట్టింపు సౌకర్యం ఉంటుంది.

తాజా ట్రెండ్స్‌ ఇవే!

  • ఎంబ్రాడిరీ, అద్దం పనితనం: సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీ, అద్దం పనితనంతో కూడిన షరాలు తాజా ట్రెండ్‌గా మారాయి

  • ప్రింటెడ్‌ డిజైన్లు కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి

  • చందేరి, ఇతరత్రా తక్కువ బరువుండే వస్త్రాలతో రూపొందే షరారాలు ప్రత్యేకించి వేసవి వస్త్రాలుగా పేరు తెచ్చుకుంటున్నాయి

  • సంప్రతాయ, సమకాలీన స్టైల్స్‌ను మేళవించి, రూపొందిస్తున్న డిజైనర్‌ షరారాలు ఆధునిక ఫ్యూజన్‌ ఛాయి్‌సగా పేరు తెచ్చుకుంటన్నాయి.

అదనపు హంగులు జోడించి...

షరారాలతో భారీ ఆభరణాలు చాలా బాగా నప్పుతాయి. ఈ దుస్తుల కోసం చాంద్‌బాలీ, కంగన్‌ లేదా కడా లాంటి ఆభరణాలు ఎంచుకోవచ్చు. చమ్కీ పనితనానికి రాళ్ల నగలు చక్కగా నప్పుతాయి. హైహీల్స్‌ లేదా బ్లంట్‌ హీల్స్‌ ధరించాలి.

ఇవి కూడా చదవండి...

ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 01:34 AM