Bathukamma Festival: నేడు సద్దుల బతుకమ్మ
ABN, Publish Date - Sep 29 , 2025 | 05:58 AM
బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తిథి...
వేడుక
బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తిథి సోమ, మంగళవారాల్లో ఉండడడంతో... కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మరికొన్ని చోట్ల మంగళవారం సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
నైవేద్యం: మలీద ముద్దలు (లడ్లు), చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం. నువ్వుల అన్నం, పెరుగన్నం తదితరాలు
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 29 , 2025 | 05:58 AM