Tips for Storing Bananas Fresh: తాజాగా ఇలా
ABN, Publish Date - Nov 24 , 2025 | 05:27 AM
అరటి పండ్లను నిల్వ చేయడం కొద్దిగా కష్టమే. తెచ్చిన రెండు రోజుల్లోనే బాగా పండి తరువాత పాడైపో తుంటాయి. చిన్న చిట్కాలు పాటించి అరటి పండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా..
అరటి పండ్లను నిల్వ చేయడం కొద్దిగా కష్టమే. తెచ్చిన రెండు రోజుల్లోనే బాగా పండి తరువాత పాడైపో తుంటాయి. చిన్న చిట్కాలు పాటించి అరటి పండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవచ్చు.
వెడల్పాటి గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి అందులో రెండు సి విటమిన్ మాత్రలు వేసి కరిగించాలి. ఈ నీటిలో అరటి పండ్లను ముంచి తీస్తే అవి వారంపాటు తాజాగా ఉంటాయి. పండ్లపై కొద్దిగా నిమ్మరసం రాసినా ఫలితం ఉంటుంది.
అరటి పండ్లు త్వరగా పండటానికి కారణం కాడల నుంచి వెలువడే ఎథిలిన్ వాయువు. కాడలను ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టేస్తే అయిదు రోజులపాటు అరటి పండ్లు తాజాగా ఉంటాయి.
అరటి పండ్లను గుత్తిగా ఉంచినట్లయితే వాటిలో ఒకటి పండినా మిగిలినవన్నీ వెంటనే మెత్తబడతాయి. కాబట్టి అరటి పండ్లను తెచ్చిన వెంటనే గుత్తి నుంచి విడదీయాలి. పండినవాటిని వేరేగా ఉంచాలి.
అరటి పండ్లను తాడు సహాయంతో హ్యాంగర్‌కు వేలాడదీస్తే చాలారోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయి.
అరటి పండ్లను పేపర్ బ్యాగ్‌లో ఉంచి వెలుతురు తగలకుండా భద్రపరిస్తే వారానికి పైగా నిల్వ ఉంటాయి.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 24 , 2025 | 05:27 AM