Tiger: అమ్మో పులి.. ఎంత దర్జాగా తిరుగుతుందో..
ABN, Publish Date - May 29 , 2025 | 10:41 AM
పులి సంచారంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. కొత్తగిరి కంబట్టి గ్రామ శివారులో పులి సంచరాన్ని గుర్తించారు. పులి సంచారం ఉందని గత కొద్దిరోజులుగా అక్కడి ప్రజలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. అక్కడ ఏర్పాటుచేసిన సీసీ టీవీ కెమెరాలో నమోదైంది.
- కొత్తగిరి సమీపంలో పులి సంచారం
- భయాందోళనలో గ్రామస్తులు
చెన్నై: కొత్తగిరి కంబట్టి గ్రామ శివారులో పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. నీలగిరి జిల్లా కట్టబెట్ట అటవీ ప్రాంతంలోని కంబట్టి గ్రామంలో బుధవారం తేయాకు తోటల మీదుగా రోడ్డు పైకి వచ్చిన పులి, కొద్దిసేపు అక్కడ సంచరించి తిరిగి తోటల మీదుగా అవడిలోకి వెళ్లింది. పులి సంచారం అ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ టీవీ కెమెరా(CCTV camera)ల్లో నమోదైంది.
అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి, పులి సంచారం వాస్తవమని నిర్ధారించారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ... ఎప్పనాడు అటవీ ప్రాంతం(Eppanadu forest area) నుంచి వచ్చిన పులి ఈ ప్రాంతంలో సంచరించి వెళ్లిందని, ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News
Updated Date - May 29 , 2025 | 10:41 AM