ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Uchi Usirika: మొక్క నుంచి బంగారం కణాలు..

ABN, Publish Date - Jul 07 , 2025 | 04:29 AM

ఈ ప్రకృతిలో అనేక అద్భుతాలు ఉన్నాయి. చాలా సార్లు అవి మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యం తెలియక పట్టించుకోం. అలాంటి ఒక మొక్క ఉచ్చి ఉసిరిక. ఈ మొక్క ఆకులలో...

ఈ ప్రకృతిలో అనేక అద్భుతాలు ఉన్నాయి. చాలా సార్లు అవి మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యం తెలియక పట్టించుకోం. అలాంటి ఒక మొక్క ఉచ్చి ఉసిరిక. ఈ మొక్క ఆకులలో నానో బంగారు కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొక్క గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

నీళ్లు ఎక్కువగా లభించని ప్రాంతాల్లో ఉచ్చి ఉసిరిక మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కకు ఫిలంథస్‌ విర్గాటస్‌ అనే శాస్త్రీయ నామం ఉంది. ఈ మొక్క 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. పొదలా గుబురుగా వ్యాపిస్తుంది. దీని ఆకులు చిన్నగా ఉంటాయి. ఈ మొక్కకు ఎర్రటి పువ్వులు పూస్తాయి. ఈ పూల నుంచి చిన్న చిన్న కాయలు కాస్తాయి. మొదట పచ్చగా ఉన్నా.. బాగా పండిన తర్వాత బ్రౌన్‌ రంగులోకి మారతాయి. ఈ మొక్కను ఆయిర్వేద వైద్యంలో కొన్ని వేల ఏళ్లుగా కామెర్లు, జీర్ణ కోశ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. ఇక ఈ మొక్క ఆకుల నుంచి నానో బంగారం కణాలు సంగ్రహించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. నీళ్ల సదుపాయం ఎక్కువగా లేని ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచుకోవటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.

డాక్టర్‌ శ్రీనాథ్‌

ఫోన్‌: 94930 02124

వృక్ష శాస్త్రవేత్త, కన్హా శాంతివనం, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

డిజిటల్‌ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 12:49 PM