పోచంపల్లి సోయగం
ABN, Publish Date - May 14 , 2025 | 03:43 AM
పోచంపల్లి చీరలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. కాబట్టే ప్రపంచ సుందరి పోటీలో పాల్గొంటున్న భామలందరూ పోచంపల్లి సందర్శించబోతున్నారు. ఈ సందర్భంగా మగువల మనసులను దోచే పోచంపల్లి చీరల సోయగాల మీద...
ఫ్యాషన్
పోచంపల్లి చీరలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. కాబట్టే ప్రపంచ సుందరి పోటీలో పాల్గొంటున్న భామలందరూ పోచంపల్లి సందర్శించబోతున్నారు. ఈ సందర్భంగా మగువల మనసులను దోచే పోచంపల్లి చీరల సోయగాల మీద ఓ లుక్కేద్దామా?
ఇక్కత్ టై అండ్ డై కోవకు చెందిన వస్త్రాల ఉత్పత్తి భారత దేశానికే సొంతం. ఒడిషా, గుజరాత్‌లతో పాటు మన తెలంగాణలోని పోచంపల్లి, ప్రాచీన ఇక్కత్ ఉత్పాదక ప్రాంతంగా పేరు పొందింది. వేలకొద్దీ మగ్గాలను కలిగి ఉన్న పోచంపల్లిలో వినూత్నమైన చీరలు రూపొందుతూ ఉంటాయి. వీటి గురించిన ఆసక్తికరమైన విశేషాలివి...
నూలు, పట్టు, సీకో వస్త్రాలతో పోచంపల్లి ఇక్కత్ చీరలు రూపొందుతాయి.
స్థానిక పోచంపల్లి డిజైన్లు ఇతర ప్రాంతాల్లోని డిజైన్లకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అసలైన పోచంపల్లి చీరలను వాటి మోటిఫ్స్ అంచులను బట్టి కనిపెట్టవచ్చు.
ప్రధానంగా జామెట్రీ డిజైన్లతో రూపొందుతున్నప్పటికీ, పక్షులు, చెట్ల డిజైన్లు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. నేయడానికి ముందు మగ్గానికి తైలం పట్టించే తైల చికిత్సను సూచించే ‘తేలియా రుమాల్’ (తైల రుమాలు) అత్యంత సంక్లిష్టమైన డిజైన్. హైదరాబాద్ నిజాంల ఆజ్ఞ మేరకు, ద్వంద్వ ఇక్కత్ ప్రక్రియతో రూపుదిద్దుకున్న తేలియా రుమాల్ డిజైన్ కాలక్రమేణా అత్యంత ఆదరణకు నోచుకుంది
పోచంపల్లి కళారూపం ఎంతో పురాతనమైనదే అయినప్పటికీ పోచంపల్లి ఇక్కత్, 2005లో మాత్రమే భారతప్రభుత్వ భౌగోళిక సూచికను దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు
Updated Date - May 14 , 2025 | 03:43 AM