ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Snake Woman India Vanita Borade: ఈ వనిత సర్పమిత్ర

ABN, Publish Date - Sep 18 , 2025 | 02:25 AM

ఏ జీవి మనిషికి శత్రువు కాదు. వాటి మానాన వాటిని బతకనిస్తే మనకు ఎలాంటి హానీ ఉండదు... ఇది మహారాష్ట్రకు చెందిన 50 ఏళ్ళ వనితా బొరాడే నిత్యం చేసే ప్రచారం 60 వేలకు పైగా సర్పాలను కాపాడిన...

ఏ జీవి మనిషికి శత్రువు కాదు. వాటి మానాన వాటిని బతకనిస్తే మనకు ఎలాంటి హానీ ఉండదు... ఇది మహారాష్ట్రకు చెందిన 50 ఏళ్ళ వనితా బొరాడే నిత్యం చేసే ప్రచారం 60 వేలకు పైగా సర్పాలను కాపాడిన ఆమె ‘స్నేక్‌ ఉమెన్‌’గా ఖ్యాతి పొందారు. ‘నారీ శక్తి’ పురస్కారం, తన పేరిట పోస్టల్‌ స్టాంప్‌, గిన్నిస్‌ బుక్‌లో చోటు.. ఇలా ఎన్నో సాధించారు. వీటన్నిటికన్నా ఇటీవల జరిగిన ఒక సత్కారాన్ని జీవితంలో మరచిపోలేనంటున్నారు వనిత. ఆ సంగతులు ఆమె మాటల్లోనే...

‘‘నేను పుట్టింది, పెరిగింది మహారాష్ట్రలోని నయ్‌గ్రామ్‌ దేశ్‌ముఖ్‌ అనే గ్రామంలో. దానికి సమీపంలోనే ఘట్‌బోరీ అరణ్యం ఉంది. మా నాన్న వ్యవసాయం చేసేవారు. అడవిలోంచి పాములు పొలాల్లోకి తరచుగా వచ్చేవి. వాటిని నాన్న ఒడుపుగా పట్టుకొనేవారు. మళ్ళీ అడవిలో విడిచిపెట్టేవారు. వాటికి హాని చేయకూడదని, బంధించకుండా స్వేచ్ఛగా వదిలెయ్యాలని ఆయన చెప్పేవారు. గ్రామంలోని చెరువుల్లో, దగ్గరగా ఉన్న నదిలో నీటి పాములు కనిపించడం సర్వసాధారణం. వాటికి విషం ఉండదు. కాబట్టి నాన్న పర్యవేక్షణలో మొదట వాటిని పట్టుకొనేదాన్ని. తరువాత విష సర్పాలను పట్టుకోవడం, అడవిలో వదిలెయ్యడం మామూలైపోయింది.

పన్నెండేళ్ళ నుంచే...

హైస్కూల్లో చదువుతూ ఉండగా, పదిహేనేళ్ళకే నాకు పెళ్ళయింది. ‘పాములు పడతానంటే నా భర్త అంగీకరిస్తారా?’ అని అనుమానపడ్డాను. కానీ ఆయన ఒప్పుకున్నారు. అంతేకాదు, సర్పాల గురించి వివరించే పుస్తకాలు కూడా తెప్పించి, నాతో చదివించారు. తద్వారా నాకు ఎన్నో విషయాలు తెలిశాయి. మా ఊరు, చుట్టుపక్కల గ్రామాలతోపాటు దూర ప్రాంతాల నుంచి కూడా పాముల్ని పట్టాల్సిందిగా నన్ను పిలిచేవారు. నేను పన్నెండేళ్ళ వయసులో పాముల్ని పట్టడం మొదలుపెట్టాను. ఇప్పటివరకూ 60 వేలకు పైగా పాముల్ని కాపాడాను. ‘ఇండియాస్‌ ఫస్ట్‌ ఉమెన్‌ స్నేక్‌ ఫ్రెండ్‌’గా గుర్తింపు పొందాను. 2020లో ‘నారీ శక్తి’ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా స్వీకరించాను. 2022లో నా పేరిట పోస్టల్‌ శాఖ స్టాంప్‌ విడుదల చేసింది. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో నా పేరు చోటు చేసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నాను. దాన్ని గొప్ప గౌరవంగా భావించాను. రెండు వారాల్లోనే అంతకన్నా సంతృప్తిని, సంతోషాన్ని కలిగించే మరో సంఘటన జరిగింది.

సత్యం ఇది.’’

కన్నీరు దాచుకోలేకపోయాను...

కిందటి నెల (ఆగస్టు) మూడోవారంలో... ఢిల్లీ నుంచి మేము నివసిస్తున్న బుల్ధానా పట్టణానికి తిరిగి వచ్చాను మళ్ళీ రోజువారీ పనుల్లో నిమగ్నమైన సమయంలో... నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన మధుకర్‌ బెలోకర్‌ మాస్టారు నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఇప్పుడు తను వాడీ గ్రామంలో స్థిరపడ్డానని చెబుతూ... తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. నా సహాధ్యాయులు మరికొందరిని కూడా ఆయన ఆహ్వానించారని తెలిసింది. నా జీవితంలో మరపురాని గురువుల్లో మధుకర్‌ మాస్టారిది మొదటి స్థానం. చదువుపట్ల ఆసక్తిని పెంచి, నైతిక విలువలను, సామాజిక బాధ్యతను విద్యార్థుల్లో ఆయన పెంపొందించారు. కొన్నేళ్ళ కిందట పదవీవిరమణ చేసిన ఆయనను కచ్చితంగా కలవాలనుకున్నాను. అనుకున్న ప్రకారం మా మాస్టారి ఇంటికి వెళ్ళాను. ఆయనతోపాటు అప్పట్లో మాకు పాఠాలు చెప్పిన ఇతర టీచర్లు, నా క్లాస్‌మేట్స్‌... ఇలా అందరూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది... అది నన్ను అభినందించడానికి, సత్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం అని. ఉపాధ్యాయులను విద్యార్థులు సత్కరించడం ఆనవాయితీ, ధర్మం. కానీ గురువుల చేతుల మీదుగా సన్మానం అందుకోవడం, వారి నుంచి ప్రశంసలు, ఆశీస్సులు పొందడం అంటే నేను ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. నా ఉద్వేగాన్ని, కన్నీటిని దాచుకోలేకపోయాను. ఆ రోజును నా జీవితాంతం మరచిపోలేను.

అది అందరం గుర్తించాలి

పాము ఎక్కడ కనబడినా భయపడి పారిపోవడం, దాన్ని వెతికి పట్టుకొని చంపేయడం అన్ని ప్రాంతాల్లో సర్వసాధారణం. పాముల విషయంలో ప్రజలకు తగిన అవగాహన లేకపోవడమే కారణం. పాములంటే భయపడడాన్ని ‘ఓఫిడియోఫోబియా’ అంటారు. కానీ మన దేశంలోని సర్పాల్లో కేవలం పది శాతం మాత్రమే విషపూరితమైనవి. మిగిలిన వాటివల్ల అలాంటి హాని జరగదు. ఒకవేళ విష సర్పాలు కాటేసినా... ప్రాణాలు కాపాడడం కోసం యాంటీవీనమ్‌ ఇంజక్షన్లు ఉంటాయి. ఈ అంశాలు నేను ప్రచారం చేస్తున్నాను. అలాగే పాము కరిచినప్పుడు ఏ చికిత్స చేయాలో గ్రామీణులకు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నాను. పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. దీనికోసం ‘సోయ్‌రే వనచరి మల్టీపర్పస్‌ ఫౌండేషన్‌’ పేరిట ఒక సంస్థ ఏర్పాటు చేశాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నా కృషికి గుర్తింపు లభించింది. మన భారతీయ సంస్కృతి గ్రామీణ జీవనంతో, అడవులతో ముడివేసుకొని ఉంది. ప్రతి ప్రాణిని పవిత్రంగా భావించే సంస్కృతి మనది. కానీ మానవులు భయంతోనో, స్వార్థంతోనో పక్షులకు, జంతువులకు, ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉన్నారు. ఇది కొనసాగితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. మనం అందరం గుర్తించాల్సిన

Also Read:

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ

దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌‌కు ఆప్ నేత సవాల్..

For More Latest News

Updated Date - Sep 18 , 2025 | 02:33 AM