Share News

Teenmaar Mallanna New Political Party: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:54 PM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరు ప్రకటించారు.

Teenmaar Mallanna New Political Party: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
Teenmaar Mallanna New Political Party

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరు ప్రకటించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను రెండు రంగులతో ప్రత్యేకంగా రూపొందించారు. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదాన్ని కూడా ముద్రించారు.


కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అయిన తీన్మార్‌ మల్లన్న ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు, పార్టీ విధానాలు ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అయితే మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో మే 1న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి మల్లన్న బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించారు. అయితే ఈ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి రోల్ పోషిస్తుందో వేచి చూడాల్సిందే.


Also Read:

పేపర్‌తో హ్యాండ్ వాష్ క్రీమ్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా..

ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

For More Latest News

Updated Date - Sep 17 , 2025 | 08:25 PM