Share News

India Pakistan Handshake: దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌‌కు ఆప్ నేత సవాల్..

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:22 PM

పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను సౌరభ్ భరద్వాజ్ తప్పుపట్టారు.

India Pakistan Handshake: దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌‌కు ఆప్ నేత సవాల్..
AAP vs Suryakumar

ఆసియా కప్-2025లో భాగంగా జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది (India vs Pakistan row). ఆ మ్యాచ్ సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం తీవ్ర వివాదం రేపింది. టీమిండియాపై పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు విరుచుకుపడ్డారు. తాజాగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను సౌరభ్ భరద్వాజ్ తప్పుపట్టారు. కేవలం మాటలతో అంకితం ఇస్తే సరిపోదని, దమ్ముంటే ఆ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని బాధితుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని సవాల్ చేశారు. ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల బాధితులకు ఒరిగేదేమీ ఉండదని అన్నారు (cricket controversy).


'పహల్గామ్ బాధితులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్టు సూర్యకుమార్ యాదవ్ చాలా తేలిగ్గా చెప్పేశారు. 'మీకు, బీసీసీఐ, ఐసీసీకి ఓ సవాల్ విసురుతున్నా. ఈ మ్యాచ్ ప్రసార హక్కులు, ప్రకటనల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఆ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చేయండి. అప్పుడు మీరు నిజంగా అంకితం ఇచ్చారని మేం ఒప్పుకుంటాం' అని సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు (political reaction cricket). తమ సంపాదనను ఇచ్చే ధైర్యం వారికి లేదని, కేవలం 'నకిలీ అంకితాలు' ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారని సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.


ఇవి కూడా చదవండి

ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:54 PM