Andy Pycroft ICC: ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
ABN , Publish Date - Sep 16 , 2025 | 08:21 AM
ఆసియా కప్‌లో హ్యాండ్‌షేక్ వివాదానికి కేంద్రంగా మారిన మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ పట్టుబడుతోంది. ఇందుకు ఐసీసీ అంగీకరించే అవకాశాలు తక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా క్రీడాకారులు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయకపోవడం వివాదంగా మారింది. ఇరు జట్ల ప్లేయర్లు కరచాలనం చేసుకోవద్దని టాస్ సమయంలో రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ సూచించడంపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఆయనను తప్పించాలని కూడా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలాంటి అభ్యర్థనలను ఐసీసీ అస్సలు ఖాతరు చేయబోదని సమాచారం. ఈ విషయంలో ఐసీసీ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించినప్పటికీ రెఫరీకీ అండగా కచ్చితంగా నిలుస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి (PCB demands removal of Andy Pycroft).
కరచాలనాలు వద్దన్న భారత క్రీడాకారుల అభిమాతాన్ని పాక్ జట్టుకు యాండీ పైక్రాఫ్ట్ చేయరవేయడంపై పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆయన క్రీడానియమావళిని పాటించలేదని పేర్కొంది. పైక్రాఫ్ట్ తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కూడా పేర్కొంది. ఆసియా కప్ మ్యాచ్ రెఫరీగా ఆయనను తక్షణం తప్పించాలని ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ సోమవారం తెలిపారు. పైక్రాఫ్ట్‌ను తొలగించకుంటే తాము ఈ టోర్నీ నుంచి తప్పుకుంటామని కూడా తేల్చి చెప్పారు. కానీ ఐసీసీ మాత్రం పైక్రాఫ్ట్‌కు మద్దతుగా ఉండే అవకాశాలు ఎక్కువని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలాంటి అభ్యర్థనలను ఐసీసీ అంగీకరించదని వెల్లడించాయి (no-handshake controversy Asia Cup)
మరోవైపు, పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నామని అన్నారు. వారికి సరైన సమాధానమే ఇచ్చామని కామెంట్ చేశారు. ఇక ఆసియా కప్ ఫైనల్స్ తరువాత జరిగే బహుమతి ప్రదాన కార్యక్రమంలో పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వీ కూడా పాల్గొంటారు. గెలిచిన టీమ్‌కు ఆయన ట్రోఫీని ప్రదానం చేస్తారు. భారత్ విజేతగా నిలిస్తే ఆయనతో కలిసి వేదిక పంచుకోబోదన్న వార్త కూడా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి చర్యల ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి