Share News

Surya Kumar on No Handshake: అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

ABN , Publish Date - Sep 15 , 2025 | 09:23 AM

పాక్ క్రీడాకారులకు టీమిండియా సభ్యులు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికంటే ఉన్నతమైనవని అన్నారు. పహల్గాం దాడి బాధితులకు తాము సంఘీభావం ప్రకటించినట్టు తెలిపారు.

Surya Kumar on No Handshake: అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
India no-handshake Pakistan,

ఇంటర్నెట్ డెస్క్: నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ప్రత్యర్థి టీం సభ్యులను అస్సలు పట్టించుకోలేదు. పలకరింపులు, నవ్వులు, కరచాలనాలు వంటివేమీ లేకుండా ఆట ముగించారు. తమ పని తాము చేసుకుని మైదానాన్ని వీడారు. ఈ విషయంపై టీమిండియా కప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా వివరణ ఇచ్చారు (India no-handshake Pakistan).

పాక్ క్రీడాకారులకు టీమిండియా సభ్యులు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఓ విలేకరి సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. దీనికి సూర్యకుమారు సూటిగా జవాబిచ్చారు. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికంటే ముఖ్యమైనవని కుండబద్దలు కొట్టారు. ‘జీవితంలో కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికంటే ముఖ్యమైనవి. పహల్గాం దాడి బాధితులకు మేము అండగా ఉంటాము. కాబట్టి, ఈ విజయాన్ని మేము ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నాము’ అని అన్నారు (Suryakumar Statement).

పాక్ క్రీడాకారులకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దనేది ప్లాన్ ప్రకారం తీసుకున్న ముందస్తు నిర్ణయమని సూర్యకుమార్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ‘ఈ మ్యాచ్‌ విషయంలో భారత ప్రభుత్వం, బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇక మిగతా విషయాలను వస్తే .. మేమిక్కడకు వచ్చాక నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడకు మేడు ఆడటానికి వచ్చాము. ఈ దిశగా సరైన బదులిచ్చామనే అనుకుంటున్నాము’ అని సూర్యకుమార్ అన్నాడు (Asia Cup 2025 handshake controversy).


ఇక అవార్డుల ప్రదానం తరువాత జరిగిన కార్యక్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా పాల్గొనలేదు. ఈ విషయమై పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ స్పందించారు. టీమిండియా సభ్యులు తమతో కరచాలనం చేయకపోవడం పాక్ జట్టు సభ్యులను నిరాశపరిచిందని అన్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ కూడా మ్యాచ్ తరువాత జరిగిన వేడుకకు వెళ్లలేదని చెప్పారు.

పహల్గాం దాడి తరువాత పాక్‌తో మ్యాచ్‌కు అంగీకరించినందుకు బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే, పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌తో పాటు ఇతర దేశాల జట్లు కూడా ఆడే టోర్నీల్లో భారత్ పాలుపంచుకుంటుందని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మ్యా్చ్ ముందు ప్రీ టోర్నమెంట్ కాన్ఫరెన్స్‌లో పాక్ కెప్టెన్‌తో సూర్యకుమార్ కరచాలనం చేయడం కూడా వివాదానికి దారి తీసింది.


ఇవి కూడా చదవండి

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

ఆసియా కప్ 205.. పాక్‌ను కుమ్మేశారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 09:24 AM