Ind vs Pak handshake Snub: పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:47 AM
నిన్నటి మ్యాచ్‌లో భారతీయుల మనోభావాలకు అద్దం పడుతూ టీమిండియా క్రీడాకారులు పాక్ క్రికెటర్లను లైట్ తీసుకున్నారు. టాస్ మొదలు మ్యాచ్ ముగిసేవారకూ పాక్ క్రీడాకారులతో మాటలు, కరచాలనాలు వంటివేమీ లేకుండా పరోక్షంగా వారిని బాయ్‌కాట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా నిన్న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ పాక్‌ను కుమ్మేసింది. టాస్ ఓడిన భారత్ ఛేదనలో నిర్దేశిత 128 పరుగుల లక్ష్యాన్ని15.5 ఓవర్లలో చేరుకుని విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న భారతీయుల మనోభావాలకు అద్దంపడుతూ టీమిండియా పాక్ క్రీడాకారులను సైలెంట్‌గా బాయ్‌కాట్ చేసింది. ఎటువంటి కరచాలనాలు, పలకరింపులు లేకుండా టీమిండియా క్రీడాకారులు మైదానంలో తమ పని ముగించుకుని వెనుదిరిగారు (Ind Boycott Pak).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, టాస్ సమయంలో భారత కప్టెన్ సూర్యకుమార్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కనీసం కన్నెత్తి చూడలేదు. కరచాలనం చేయలేదు. టాస్ అయిపోయాక తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ తరువాత మ్యాచ్ చివర్లో సిక్స్ కొట్టి విజయం అందుకున్న తరువాత కూడా భారత క్రీడాకారులు పాక్ టీమ్ విషయంలో ఎలాంటి మర్యాదలు పాటించలేదు. కరచాలనాలు, నవ్వులు వంటివేవీ లేకుండా తమదారిన తాము మైదానం నుంచి వెళ్లిపోయారు. స్టేడియంలో ఇతర టీమిండియా క్రీడాకారులు, స్టాఫ్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పాక్ టీం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో, టీమిండియా పాక్‌ను సైలెంట్‌గా బాయ్‌కాట్ చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి (No customary Handshake Between Ind and Pak).
ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాక్ 20 ఓవర్లలో కేవలం 127 పరుగులే చేయగలిగింది. భారత్ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇక భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు చేసి దూకుడు కనబరిచాడు. ఆ తరువాత సూర్యకుమార్ అదే దూకుడు కొనసాగిస్తూ 37 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి బంతిలో సిక్స్ బాది టీమిండియాకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు.
ఇవి కూడా చదవండి
Iఆసియా కప్ 205.. పాక్‌ను కుమ్మేశారు
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మన బంగారాలు మీనాక్షి జైస్మిన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి