World Boxing Championships Liverpool: మన బంగారాలు మీనాక్షి జైస్మిన్
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:43 AM
జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హూడా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. తద్వారా భారత బాక్సింగ్ చరిత్రలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు...
రెండు స్వర్ణాలు కొల్లగొట్టిన భారత బాక్సర్లు
నూపుర్‌కు రజతం
పూజకు కాంస్యం
లివర్‌పూల్ (ఇంగ్లండ్): జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హూడా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. తద్వారా భారత బాక్సింగ్ చరిత్రలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. జైస్మిన్, మీనాక్షి అద్భుత ప్రతిభతో విదేశీ గడ్డపై పోటీల మహిళా విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన (2-1-1=4 పతకాలు) చేసిన ఘనతను భారత్ అందుకుంది. ఆదివారం జరిగిన మహిళల 57 కి. విభాగం ఫైనల్లో జైస్మిన్ 4-1 స్కోరుతో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జూలియా సెజెర్‌మెటా (పోలెండ్)ను చిత్తు చేసి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది. 48 కి. కేటగిరీ తుదిపోరులో మీనాక్షి హూడా 4-1 స్కోరుతోనే పారిస్ విశ్వక్రీడల్లో కాంస్యం సాధించిన నజిమ్ కిజబై (కజకిస్థాన్)ను ఓడించి వరల్డ్ టైటిల్ దక్కించుకుంది. ఇక హోరాహోరీగా సాగిన మహిళల 80+కి. స్వర్ణ పతక పోరులో నూపుర్ షెరాన్ 2-3తో కజమరస్కా అగాట (పోలెండ్) చేతిలో ఓడి రజతం కైవసం చేసుకుంది. మహిళల 80 కిలోల విభాగం సెమీఫైనల్లో పూజారాణి 4-1తో సెర్మెటా జూలియా (పోలెండ్) చేతిలో పరాజయం చవిచూడడంతో కాంస్య పతకానికే పరిమితమైంది. మొత్తంగా..ఈసారి వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత మహిళలు రెండు స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్యంతో అత్యుత్తమ ప్రదర్శన చేయడం విశేషం. పసిడి పతకాలు సాధించడం ద్వారా..ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో ఆరు స్వర్ణాలు చేజిక్కించుకున్న మేరీకోమ్, రెండుసార్లు విజేత నిఖత్ జరీన్, సరితాదేవి, జెనీ ఆర్‌ఎల్, కేసీ లేఖ, నితూ ఘన్హాస్, లవ్లీనా బోర్గొహైన్, స్వీటీ బూరా సరసన మీనాక్షి, జైస్మిన్ చేరారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి