PM Modi Assam: నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:07 PM
నేను శివుని భక్తుడిని, విషం అంతా మింగేస్తాను. కానీ ఇతరులను అవమానిస్తే మాత్రం సహించలేనని ప్రధాని మోదీ అన్నారు. అస్సాంలోని దరాంగ్ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. ఇంకా ఏం అన్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు (సెప్టెంబర్ 14న) అస్సాంలో (assam) పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. 1962లో జవహర్‌లాల్ నెహ్రూ పాలనలో చైనా దురాక్రమణ వల్ల ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదన్నారు. ఈ క్రమంలో మీరు నన్ను వ్యక్తిగతంగా ఎంత తిట్టినా నాకు పట్టింపు లేదు. కానీ దేశంలోని గొప్ప వ్యక్తులను అవమానించినప్పుడు, అది తీవ్రంగా బాధిస్తుందని మోదీ అన్నారు.
నేను శివుని భక్తుడిని, అన్ని విషాలను మింగేస్తానన్నారు. భూపెన్ హజారికాకు భారతరత్న ఇవ్వడం సరైన నిర్ణయం కాదా, దీనిపై కాంగ్రెస్ పార్టీ అవమానించడం కరెక్టేనా అంటూ ప్రజలను ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలుస్తుందని, అయినప్పటికీ నాకు 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీపై మోదీ
ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు వారి ఓటు బ్యాంకు ప్రయోజనాలే ముఖ్యమని, ఎప్పుడూ దేశ ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూడా దేశ వ్యతిరేకులు, చొరబాటుదారుల రక్షకుడిగా కాంగ్రెస్ మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, చొరబాట్లను ప్రోత్సహించేది. నేడు కాంగ్రెస్ చొరబాటుదారులు భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడాలని, దేశ భవిష్యత్తును నిర్ణయించాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
మీ సమయం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఏ ప్రాంతంలోనైనా వేగవంతమైన అభివృద్ధికి కనెక్టివిటీ చాలా ముఖ్యం. 6 దశాబ్దాల స్వాతంత్ర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అస్సాంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అందులో బ్రహ్మపుత్రపై కేవలం 3 వంతెనలు మాత్రమే నిర్మించబడ్డాయి. ఇప్పుడు మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, 6 వంతెనలు నిర్మించినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో నేను మరిన్ని పనులు చేయాలనుకుంటున్నానని, అసోం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ప్రధాని మోదీ.
18 వేల కోట్ల ప్రాజెక్టులు
ప్రధాని మోదీ నేడు అస్సాంలోని దరాంగ్ పర్యటనలో ఉన్నారు. బయో-ఇథనాల్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించారు. దీనిని రూ.5 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. పాలీ ప్రొఫైలిన్ ప్లాంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో రూ.18,530 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని అస్సాంకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి అస్సాంకు వచ్చానని చెప్పిన మోదీ.. మా కామాఖ్య దేవి ఆశీర్వాదంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి