Best FD 444 days: రూ.10.25 లక్షల పెట్టుబడి.. ఎక్కువ లాభం ఇచ్చే బ్యాంకు ఇదే
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:40 PM
మీరు మీ సంపాదనను సురక్షితంగా పెట్టుబడి చేసి, స్థిరమైన ఆదాయం పొందాలని ఆశిస్తున్నారా. అందుకోసం గ్యారెంటీ రాబడి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మంచి ఛాయిస్. ప్రస్తుతం 444 రోజుల ప్రత్యేక FDలో ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
మీరు మీ డబ్బుని సురక్షితంగా పెట్టుబడి చేసి, గ్యారెంటీ రాబడి పొందాలని చూస్తున్నారా. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు బ్యాంకులు 444 రోజుల స్పెషల్ FD స్కీమ్‌లను పరిచయం చేస్తున్నాయి. ఇవి సాధారణ FDల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రిస్క్ ఉన్న పెట్టుబడులతో పోలిస్తే, ఈ FDలు సురక్షితమైన రిటర్న్స్ అందిస్తాయి.
ప్రస్తుతం మీరు రూ.10.25 లక్షలు పెట్టుబడి చేయాలని అనుకుంటే దేనిలో ఎక్కువ రాబడి వస్తుందో ఇప్పుడు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకులు ఈ స్పెషల్ FD స్కీమ్‌ని అందిస్తున్నాయి.
SBI అమృత్ వృష్టి స్పెషల్ FD
SBI ఈ 444 రోజుల FD స్కీమ్‌ని అమృత్ వృష్టి అని పిలుస్తోంది. సాధారణ కస్టమర్లకు ఇక్కడ వడ్డీ రేటు 6.60%. ఈ క్రమంలో రూ.10.25 లక్షలు పెట్టుబడి చేస్తే, 444 రోజుల తర్వాత మీకు సుమారు రూ.11,09,958.24 వస్తాయి. అంటే మీరు రూ.84,958.24 వడ్డీగా పొందుతారు. సీనియర్ సిటిజన్స్‌కి కొంచెం ఎక్కువ వడ్డీ ఉంటుంది.
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 444 రోజుల FDపై 6.70% వడ్డీ ఇస్తోంది. ఇది SBI కంటే కొంచెం ఎక్కువ. దీనిలో మీరు రూ.10.25 లక్షలు పెడితే, మెచ్యూరిటీ విలువ సుమారు రూ.11,11,287.15 అవుతుంది. అంటే, మీ వడ్డీ రూ.86,287.15. ఈ బ్యాంక్‌లో మీ రాబడి SBI కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)
IOB ఈ 444 రోజుల FDలో అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తోంది 6.75%. ఇక్కడ మీరు రూ.10.25 లక్షల పెట్టుబడితో మీరు 444 రోజుల తర్వాత సుమారు రూ.11,11,952.08 పొందుతారు. అంటే, మీ వడ్డీ రూ.86,952.08. ఇది ఈ జాబితాలోని బ్యాంకుల్లో ఎక్కువ రాబడి ఇచ్చే స్కీమ్.
కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ 444 రోజుల FDపై 6.50% వడ్డీ రేటు ఇస్తోంది. ఇది ఈ జాబితాలో అతి తక్కువ వడ్డీ రేటు. దీనిలో రూ.10.25 లక్షలు పెడితే, మీరు దాదాపు రూ.11,08,630.59 పొందుతారు. అంటే వడ్డీ రూ.83,630.59. ఇది ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ రాబడి కొంచెం తక్కువ.
ఏ బ్యాంక్ బెస్ట్?
మీరు రూ.10.25 లక్షలు పెట్టుబడి చేయాలనుకుంటే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) 6.75% వడ్డీతో ఎక్కువ రాబడి ఇస్తోంది. రూ.11,11,952.08 మెచ్యూరిటీ విలువతో, ఇది మిగతా బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువ లాభం ఇస్తుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ (6.70%) రెండో స్థానం, SBI (6.60%) మూడో స్థానం, కెనరా బ్యాంక్ (6.50%) చివరి స్థానంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి